అసభ్య ఫేస్ బుక్ పోస్టులపై హీరోయిన్ పిర్యాదు.. Kavya Madhavan trolled for marrying Dileep, files police complaint

Kavya madhavan trolled for marrying dileep files police complaint

kavya madhavan dileep wedding, kavya madhavan dileep films, kavya madhavan dileep news, Kavya, kavya madhavan, Kavya madhan facebook, kavya madhavan complaint, Kavya madhavan trolls, marriage, online abuse, facebook, entertainment news

After being constantly subjected to trolls and abusive comments on social media over her marriage to actor Dileep, Kavya Madhavan has filed a police complaint..

అసభ్య ఫేస్ బుక్ పోస్టులపై పోలీసులకు హీరోయిన్ పిర్యాదు..

Posted: 01/19/2017 06:47 PM IST
Kavya madhavan trolled for marrying dileep files police complaint

మహిళలను కించపరచడం మన సంస్కృతి కాదు. కానీ నెట్ జనులు మాత్రం తమ అభిప్రాయాలను వ్యక్త పర్చడంలో ఎలాంటి అడ్డుగోడలు లేవని చెబుతున్నారు. అయితే అభిప్రాయాలను వ్యక్తం పర్చడం వేరు.. అదే పనిగా ఒకర్ని విమర్శించడం వేరన్న విషయం వారికి తెలియడం లేదు. తమ అభిప్రాయాలను వ్యక్తం చేసేప్పుడు.. అదే కామెంట్లతో ఇతరులు నోచ్చుకుంటున్నారన్న విసయాన్ని వారు మర్చిపోతున్నారు. సరిగ్గా ఇలాగే అనుభవమే ఎదురైంది మాలీవుడ్ ప్రముఖ నటికి.

మళయాళ సినీ హీరోయిన్ కావ్య మాధవన్‌కు తనకు కలిగిన మనోవేదనకు ఏకంగా పోలీసులకు పిర్యాదు చేసింది. వెంటనే చర్యలు తీసుకోవాలని వారిని కోరింది. తన వివాహం విషయమై నెట్ జనులు అసభ్య కామెంట్లు పెట్టడం.. విపరీతాలకు పోవడంపై అమె తీవ్రంగా మండిపడింది. తన వివాహం విషయంలో కొందరు పనిగట్టుకుని సామాజిక మాధ్యమాల్లో తప్పుడు రాతలు రాస్తూ ఆమె మనసును గాయపరుస్తున్నారట. అందుకే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
కొచ్చి సిటీ పోలీసుల కథనం ప్రకారం మళయాళ సినీ నటి కావ్య మాధవన్‌కు నవంబరు 25న దిలీప్‌తో వివాహమైంది. ఇది ఇద్దరికీ రెండో వివాహమే. అయితే దానిని ఎత్తిచూపుతూ నెట్ జనులు అమెపై విమర్శల పర్వానికి దిగారు. ఆమెపైనా, దిలీప్‌పైనా సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన పోస్ట్‌లు పెడుతుండటంతో దంపతులిద్దరూ తీవ్ర మనోవేదనకు గురయ్యారు. గత రెండు నెలలుగా ఓపిక పట్టిన నటి.. ఇంకా తనపై, తన భర్తపై వస్తున్న కామెంట్లపై వుండబట్టలేకపోయింది. అంతే ఏకంగా పోలీసులను అశ్రయించింది.

ఆమె నిర్వహిస్తున్న డిజైన్ వెంచర్ లక్ష్య.కామ్ ఫేస్‌బుక్ పేజీలోనే ఈ చెడు వార్తలు పోస్ట్ అవుతుండటంతో మరింత బాధపడుతున్నారు. ఆమె ఎర్నాకుళం రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసులు ఆమె స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. ఆమె గతంలో కూడా పోలీసులను ఆశ్రయించారు. తన వ్యక్తిగత జీవితంపై పుకార్లు ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ కేసు పెట్టారు. ఆమె పేరుపై నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్‌ను నిర్వహిస్తున్న ఓ వ్యక్తిని గతంలో అరెస్టు చేశారు. ఆమె పేరుపై ఇటువంటి నకిలీ ప్రొఫైల్స్ 12 ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kavya madhavan  dileep  wedding  marriage  online abuse  facebook  entertainment news  

Other Articles