చంద్రబాబు పై మళ్లీ సెటైర్లు.. ఎన్టీఆర్ పిల్లలే పార్టీ మారారు కదా! | KTR satires on Chandrababu.

Ktr satires on chandrababu and tdp in telangana assembly session

KTR, Hyderabad Development, Chandrababu Naidu, Minister KTR, KTR Chandrababu Naidu, Hyderabad Development, KTR Hyderabad Development, KTR in assembly, KTR on Amaravati, KTR satires on AP capital, Maganti versus Revanthreddy

Minister KTR Speech On Hyderabad Development, Satires on TDP and Chandrababu Naidu.

కేటీఆర్ ఆయన్ని ఇంకా వదలడా?

Posted: 01/17/2017 03:48 PM IST
Ktr satires on chandrababu and tdp in telangana assembly session

తెలంగాణ శాసనసభ సమావేశాల్లో అధికార పక్షాన్ని ఇరకాటం పెట్టేందుకు కాంగ్రెస్, టీడీపీలు తమ వంతు ప్రయత్నాలను ముమ్మరంగా చేస్తున్నాయి. వీటికి తోడు బీజేపీ కూడా జత కావటం నేటి సమావేశంలో హైలెట్ గా మారింది. భాగ్యనగరం దుస్థితిని లెవనెత్తి వాళ్లు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి కూడా గట్టిగానే సమాధానం వినిపించింది. అయితే ఈ క్రమంలో ఐటీ మంత్రి కేటీఆర్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రస్తావనను తేవటం కొసమెరుపుగా చెప్పుకోవచ్చు.

హైదరాబాద్ అభివృద్ధి గురించి చర్చ సందర్భంగా విశ్వనగరంగా కాకుండా విషాద నగరంగా తయారు చేస్తున్నారంటూ కిషన్ రెడ్డి మండిపడ్డాడు. దీనికి టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కొనసాగింపుగా మాట్లాడగా, వెంటనే మైక్ అందుకున్న కేటీఆర్ టీడీపీని టార్గెట్ చేశాడు. విశ్వ నగరాలు రాత్రికి రాత్రే తయారుకావన్నారు. ఏమీ లేని చోట సింగపూర్ లా తయారు చేస్తామంటూ ప్రకటనలు చేస్తున్నారంటూ వ్యాఖ్యానించాడు. వాళ్ల అధినేతే ఇక్కడి నుంచి అంతా సర్దుకుని వెళ్లితే.. అవశేషాలు మాత్రం మిగిలాయని,  సినీ దర్శకుల దగ్గరికీ వెళ్తుంది ఎవరో అందరికీ తెలుసంటూ ఛలోక్తులు విసిరాడు. (అమరావతి కోసం జక్కన్న)

నగర అభివృద్ధికి సంస్కరణలు అవసరమనన్న కేటీఆర్, ఏమీ చేయకుండానే తమకు జీహెచ్‌ఎంసీలో 99 సీట్లు వచ్చాయా? అని ప్రశ్నించాడు. అసలు ‘పానీ’పట్ యుద్ధాలకు చెక్ పెట్టింది టీఆర్ఎసే కదా అని తెలిపాడు. ఇప్పటికే అమలు చేసిన సంస్కరణల్లో భాగంగానే డీపీఎంఎస్ తీసుకొచ్చాం. పేకాట, గుడుంబాను నిర్మూలించినం. నాలాల ఆక్రమణలు తొలగించకుండా ప్రత్యామ్నాయాలు చూస్తున్నమని కేటీఆర్ అన్నారు. రోడ్డు రీస్టోరేషన్ టెండర్లు ఆమోదించాకే తవ్వకాలకు అనుమతిస్తున్నట్లు తెలిపారు. విషాద నగరమంటూ కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బాధాకరమంటూ కేటీఆర్ చెప్పుకొచ్చాడు.

రేవంత్ వర్సెస్ మాగంటి

టీడీపీ శాసనసభాపక్ష నేత రేవంత్ రెడ్డి, టీడీపీ నుంచి టీఆర్ఎస్ కు వెళ్లిన మాగంటి గోపీనాథ్ మధ్య శాసనసభ లాబీల్లో ఆసక్తికర సంవాదం నడిచింది. ఎన్టీఆర్ గురించి నీకేం తెలుసు? అంటూ మాగంటి, రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. దానికి రేవంత్ రెడ్డి సమాధానమిస్తూ, తనకు ఎన్టీఆర్ గురించి ఏమీ తెలియదని, కనీసం ఆయనను దగ్గర్నుంచి చూడను కూడా చూడలేదని అన్నారు. పార్టీ కార్యాలయంలో కొత్త ఛాంబర్ కు వెళ్తూ పెద్దమ్మగుడికి వెళ్లి ఛాంబర్ లో అడుగుపెట్టావు. అభిమానముంటే ఎన్టీఆర్ ఘాట్ నుంచి ఛాంబర్ లో అడుగుపెట్టేవాడివని మాగంటి గోపీనాథ్ ఎత్తిపొడిచారు.

దీనికి బదులుగా రేవంత్ రెడ్డి సమాధానమిస్తూ, నువ్వు పార్టీ ఫిరాయించినప్పుడు ఎన్టీఆర్ ఘాట్ నుంచే వెళ్లావా? అని సెటైర్ వేశాడు. దీనికి మాగంటి సమాధానమిస్తూ, ఇంటి నుంచి నేరుగా అసెంబ్లీకి వచ్చానని చెప్పారు. దీనికి రేవంత్ తాను పెద్దమ్మగుడినుంచి బయల్దేరినా ఎన్టీఆర్ భవన్ కే వెళ్లానని ఎత్తిపొడిచారు. దానికి మాగంటి కౌంటర్ ఇస్తూ, ఎన్టీఆర్ కొడుకులు, కుమార్తెలే పార్టీ మారారు అంటూ ఎదురు సమాధానమిచ్చాడు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana Minister  KTR  Satires  TDP  Chandrababu Naidu  AP Capital  

Other Articles