జయ జిరాక్స్ దిగిపోయింది.. ఇక శశికి చుక్కలే... | Revolt with in AIADMK Deepa Jayakumar's Political Debut.

Deepa jayakumar says she has already entered politics

Sasikala Natarajan, AIADMK revolt, Jayalalithaa's niece, Deepa Jayakumar, Deepa Jayakumar Tamil Nadu Politics, Anti Sasikala Natarajan group, Deepa Jayakumar MGR

jayalalithaa's niece deepa jayakumar her lookalike set for political debut, Anti Sasikala Natarajan group supports her.

దీప వచ్చేసింది.. చిన్నమ్మకి కష్టాలు తప్పవా?

Posted: 01/17/2017 10:27 AM IST
Deepa jayakumar says she has already entered politics

చెప్పినట్లుగానే దివంగత సీఎం, అమ్మ జయలలిత.. మేనకొడలు దీప జయకుమార్ ప్రకటన చేసేసింది. తాను తమిళ రాజకీయాల్లోకి వచ్చేసినట్టేనని, ఇక భవిష్యత్ కార్యాచరణను నేడో రేపో వెల్లడిస్తానని దీప వెల్లడించింది. మెరీనా బీచ్ లో ఎంజీఆర్ శతజయంతి వేడుకలకు హాజరైన ఆమె భారీ సంఖ్యలో మద్దతుదారులను వెంటబెట్టుకుని వచ్చింది. ఆపై ఎంజీఆర్ కు నివాళులు అర్పించింది.

త్వరలోనే రాష్ట్రమంతటా పర్యటిస్తానని, అన్నాడీఎంకే పార్టీలోని ప్రతి కార్యకర్తనూ, ప్రజలను కలుస్తానని చెప్పారు. అదే సమయంలో తన ఫోటోను ఫ్లెక్సీలలో చేర్చకండి అంటూ కార్యకర్తలకు ఆమె విజ్నప్తి చేసింది. ఇక అన్నాడీఎంకేలోని శశికళ వ్యతిరేక వర్గం దీప నాయకత్వాన్ని పూర్తిగా సమర్థిస్తున్నట్టు తెలుస్తోంది. ఇంతకాలం చిన్నమ్మ నాయకత్వంను వ్యతిరేకిస్తూ లోలోపలే కుమిలిపోతున్న వాళ్లకి దీప ఓ ఆశాకిరణంగా కనిపిస్తోంది. శశికళను ఎదుర్కొనే సత్తా జయలలిత మేనకోడలికే ఉందని, ప్రజల్లోకి వెళితే, ఆమె తొందరగా పాపులర్ అవుతారని అంటున్నారు.

అయితే అదే సమయంలో శశికళ వర్గీయులు సైతం పెద్దఎత్తున అక్కడికి చేరుకోవడంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. ఇరు వర్గాల మధ్యా పోటాపోటీ ప్రదర్శనలు జరిగాయి. నినాదాలు హోరెత్తాయి. దీప వెంట ఉన్న అన్నాడీఎంకే కార్యకర్తల సమూహం ఆశ్చర్య పరిచింది. ఏదిఏమైనా తమిళనాడు రాజకీయాలు మరింత వేడెక్కటం ఖాయమని, ఊహించని మలుపులు తిరుగుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 'అఖిల భార‌త అమ్మ ద్ర‌విడ మున్నేట్ర క‌జ‌గం' (ఏఐఏడీఎంకే) పేరుతో పార్టీనే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మ‌రోవైపు జ‌య‌ల‌లిత రాజ‌కీయ స‌ల‌హాదారు దురై బెంజిమిన్ 'అమ్మ మ‌క్క‌ల్ మున్నేట్ర సంఘం' పేరుతో సోమ‌వారం ఓ పార్టీని స్థాపించి రిజిస్ట్రేష‌న్ కూడా చేయించాడు కూడా.

బీజేపీ కుట్ర: శశికళ భర్త

త‌మ ప్ర‌భుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్ర‌య‌త్నిస్తోందంటూ అన్నాడీఎంకే ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శ‌శిక‌ళ భ‌ర్త న‌ట‌రాజ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రాన్ని కాషాయ‌మయం చేసేందుకు, ప్ర‌భుత్వాన్ని కూల‌దోసేందుకు బీజేపీ కుట్ర ప‌న్నుతోంద‌ని సోమ‌వారం తంజావూరులో మీడియా ముందు ఆరోపించారు. అయితే బీజేపీ ఆట‌ల‌ను సాగ‌నివ్వ‌బోమ‌ని పేర్కొన్నారు. తాము కుటుంబ రాజ‌కీయాలే చేస్తున్నామ‌ని, ఇందులో దాప‌రికం లేద‌ని తేల్చి చెప్పాడు.

ఎంజీఆర్ మృతి త‌ర్వాత జయ‌ల‌లిత‌ను కాపాడింది తామేన‌న్నారు. ముఖ్య‌మంత్రిగా ప‌న్నీర్ సెల్వం స‌మ‌ర్థంగానే ప‌నిచేస్తున్నార‌ని, ఇప్ప‌టికిప్పుడు ఆయ‌న‌ను మార్చే ఉద్దేశం త‌మ‌కు లేద‌న్నారు. శ‌శిక‌ళ ముఖ్య‌మంత్రి ప‌ద‌వి చేప‌ట్టాలా? వ‌ద్దా? అనేది శాస‌న‌స‌భ్యుల నిర్ణ‌యం ప్ర‌కారం ఉంటుంద‌న్నారు. ప్ర‌స్తుతానికైతే ప‌న్నీర్ సెల్వంను మార్చే ఉద్దేశం లేద‌న్నారు. ప్ర‌భుత్వాన్ని కూల‌దోసేందుకు వ్య‌తిరేక శ‌క్తులు చేస్తున్న కుట్ర‌ల‌ను క‌లిసి క‌ట్టుగా అడ్డుకోవాల‌ని కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల‌కు న‌ట‌రాజ‌న్ పిలుపునిచ్చాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Deepa Jayakumar  Political Entry  Sasikala Natarajan  AIADMK  revolt  

Other Articles