ఆ సెల్ఫీ మృతిపై బోలెడు అనుమానాలు | Russian teen falls from OKO's 86th floor while taking selfie.

Teen slips taking selfie on europe tallest building

Selfie Death, Russian Teenager, OKO tower, Teen slips taking selfie, Europe tallest building, Selfie Death mystery, Russian teen falls, falls while taking selfie, 86th floor Bulding,

Russia Teenager plunges to his death from Europe's tallest building OKO's 86th floor as he 'tries to take a selfie'.

అదసలు సెల్ఫీ మరణమా? కాదా?

Posted: 01/17/2017 08:52 AM IST
Teen slips taking selfie on europe tallest building

రష్యాలో ఓ యువకుడి అనుమానాస్పదన మృతి సంచలనంగా మారింది. 86 అంత‌స్తుల భ‌వ‌నంపై నుంచి కింద‌కు దూకి ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న లో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ర‌ష్యాలోని పెద్దదైన టవర్లలో ఒకటైన మాస్కో ఓకో టవర్ వ‌ద్ద‌ ఈ ఘటన చోటుచేసుకుంది.

మూడు రోజుల క్రితం ఆ యువ‌కుడు కింద పడి మరణించాడు. ఆ ట‌వ‌ర్‌ ఎత్తు సుమారు 1,162 అడుగులు ఉంటుంది, యూరప్ లోనే అతిఎత్తైనదిగా దీనికి పేరుంది. పలు వ్యాపార, వాణిజ్య సంస్థలు కూడా ఉన్న ఈ ట‌వ‌ర్ ఎల్ల‌ప్పుడూ ర‌ద్దీగా క‌న‌ప‌డుతుంది. అయితే సెల్ఫీ దిగే ప్ర‌య‌త్నంలోనే కింద‌కు ప‌డిపోయాడ‌ని కొంద‌రు చెబుతున్నారు. అయితే, తండ్రితో గొడవ ప‌డి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌ని కూడా మ‌రి కొంద‌రి వాద‌న‌.

18 ఏళ్ల అలెగ్జాండర్ అనే ఈ యువకుడు ఒక్క‌సారిగా ఓకో టవర్‌ పైనుంచి పార్కింగ్‌లో ఉన్న ఓ మెర్కిడిస్ బెంజ్ కారుపై పడి ప్రాణాలు కోల్పోయాడు. రష్యాలోని కొన్ని వార్తాపత్రికలు మాత్రం ఈ న్యూస్‌ని ప్రచురిస్తూ... ఆ యువ‌కుడు త‌న‌ తండ్రితో కలిసి స్కేటింగ్‌ చేసేందుకు ఓకో టవర్‌కి వచ్చాడని, అదే స‌మ‌యంలో త‌న తండ్రితో గొడ‌వ‌కు దిగి మనస్తాపానికి గురై కిందకి దూకి మృతి చెందాడ‌ని పేర్కొన్నాయి. మ‌రి కొంద‌రు మాత్రం ట‌వ‌ర్‌పై సెల్ఫీ దిగేందుకు ఆ యువ‌కుడు చేసిన ప్రయత్నమే కార‌ణ‌మ‌ని చెబుతున్నారు. ఏది ఏమైనా అతని తండ్రి తీవ్ర షాక్ లో కోమాలో ఉండటంతో, టవర్ పై భాగంలో కెమెరాలు లేకపోవటంతో ఈ కేసు మిస్టరీ చేధించేందుకు పోలీసులు తీవ్రంగా యత్నిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles