చిన్నమ్మను అలాంటి కోరిక కోరాడు.. కోపంతో ఊగిపోయింది | Sushma Swaraj fire on a pune based citizen to get his wife transfer.

Sushma swaraj slams a husband for requesting wifes transfer

Sushma Swaraj, Pune man, Wife transfer tweet, Sushma Swaraj Angry, internal affair tweet to Sushma Swaraj, Chinnamma angry with tweet, Sushma Swaraj slams husband tweet, Pune man request Sushma Swaraj, Sushma Swaraj twitter angry

Sushma Swaraj shuts up Pune man with terse tweet after he seeks help on an 'internal affair'.

ఆ టెక్కీ కోరికతో మహిళా మంత్రికి మండింది

Posted: 01/09/2017 12:35 PM IST
Sushma swaraj slams a husband for requesting wifes transfer

ట్విప్లొమసీ(ట్విట్టర్) ద్వారా సాయం చేస్తూ 100 మంది ప్రపంచ మేధావుల జాబితాలో చోటు సంపాదించుకుంది విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్. తన దృష్టికి వచ్చే సమస్యలను సామాజిక మాద్యమం వేదికగానే పరిష్కరించటం ఆమెకు మొదటి నుంచి వస్తున్న అలవాటే. అలాంటి పేరున్న బీజేపీ 'చిన్నమ్మ' సుష్మా స్వరాజ్ కు కోపం వచ్చింది.

పుణెకు చెందిన ఓ ఐటీ ఉద్యోగి చేసిన ట్వీట్ కు ఆమె అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. అతనే గనుక తన శాఖలో పని చేస్తుంటే సస్పెండ్ చేసుండేదాన్నని ఘాటుగా సమాధానం ఇచ్చారు. "మేడన్ నా భార్య ఝాన్సీ రైల్వే స్టేషన్ లో ఉద్యోగినిగా పని చేస్తోంది. నేను పుణెలోని ఐటీ కంపెనీలో పని చేస్తున్నాను. ఆమెను పుణెకు బదిలీ చేసేందుకు సహకరించండి" అని అతను కోరగా, సోషల్ మీడియాలో ఇటువంటి ప్రశ్నలు అడుగుతారా? అని సుష్మ కోప్పడ్డారు.

మీరిద్దరూ తన మంత్రిత్వ శాఖలో ఉద్యోగులై ఉంటే ఇంటికి పంపేదాన్నని అన్నారు. ఆపై ఆ ట్వీట్ ను రైల్వే మంత్రి సురేష్ ప్రభుకు పంపగా, విషయం తన దృష్టికి తెచ్చినందుకు సుష్మా స్వరాజ్ కు ధన్యవాదాలంటూనే, బదిలీల్లో తన జోక్యం ఉండదని మంత్రి వెల్లడించాడు. ఇట్లాంటి వ్యవహారాలను రైల్వే బోర్డే చూసుకుంటుందని సురేష్ ప్రభు తెలిపాడు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sushma Swaraj  Twitter  Angry  Pune Man  

Other Articles