షాకింగ్ వీడియో: యువతిని అడ్డుకుని వక్షోజాలను పట్టుకుని, ముద్దుపెట్టుంటూ... | men on scooter molest woman video.

Woman molested on street in bengaluru

Bengaluru, molestation, Kammanahalli Video, molestation footage, Bengaluru Shocking Video, molestation Video, Bengaluru scooter men molestation, Bengaluru new year molestation, Bangalore molestation, Bangalore woman molestation video, Bangalore badmash

Shocking incident of molestation in Bengaluru, two men on a scooter blocked a young woman's path off Kammanahalli 5th Main Road, and then groped her. CCTV grabs show beasts that roamed Bengaluru roads.

ITEMVIDEOS:బెంగళూరు లైంగిక వేధింపుల సంచలన వీడియో

Posted: 01/04/2017 10:28 AM IST
Woman molested on street in bengaluru

హైటెక్ నగరం బెంగళూర్ మహిళలకు ఏ మాత్రం భద్రత లేదని మరోసారి నిరూపించింది. నూతన సంవత్సరం సందర్భంగా జరిగిన సామూహిక అకృత్యాల కాండ ఇంకా వార్తల్లో నానుతుండగానే, మరో దారుణమైన ఘటన వెలుగు చూసింది. అర్థరాత్రి అంత చూస్తుండగానే ఓ యువతిపై ఇద్దరు యువకులు అసభ్యకరంగా ప్రవర్తించిన తీరు వీడియో ఫుటేజీ ద్వారా బయటపడింది.

తూర్పు బెంగళూరు కమ్మానహల్లి ప్రాంతానికి చెందిన ఓ యువతి నూతన సంవత్సరం వేడుకలకు హాజరై తిరిగి ఇంటికి పయనమైంది. అర్థరాత్రి 2.30 సమయంలో ఆటో దిగి ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా, ఓ ఇద్దరు యువకులు వెంబడించారు. బండిని పక్కన ఆపి అందులో ఒకడు ఆమెను చుట్టుముట్టి వేధించాడు.

 

యువతి వక్షోజాలను గట్టిగా పట్టుకుని ముద్దు పెట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. దాంతో యువతి అతని చెంపపై గట్టిగా వాయించింది. రెచ్చిపోయిన ఆ మృగం ఇష్టం వచ్చినట్లు యువతిని తాకాడు. ఆపై మెల్లిగా బైక్ దగ్గరికి లాక్కెళ్లగా ఇంకో యువకుడు కూడా అసభ్యరీతిలో రెచ్చిపోయారు. అక్కడ ఓ ఇంట్లో అమర్చిన సీసీ కెమెరా పుటేజీలో అదంతా రికార్డ్ అయ్యింది. దారినపోయే వాళ్లు ఆగి మరీ చూడటం అందులో కనిపిస్తోంది. యువతి బాధతో ఏడుస్తుంటే, ఆ దారిన పోతున్న వారు చూస్తూ ఆగిపోయారే తప్ప, ఒక్కరైనా ఆమెకు సాయపడేందుకు ముందుకు రాలేదు.

జనసందోహం ఎక్కువ కావటంతో ఆ ఇద్దరు అక్కడి నుంచి పరారయ్యారు. వీడియో మీడియాలో సంచలనం కలిగించగా, పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్ ని పరిశీలిస్తున్నట్టు తెలిపారు. కేవలం ఆమె ఇంటికి 50 మీటర్ల దూరంలోనే జరిగిన ఈ హఠాత్ పరిణామంతో యువతి భీతిల్లిపోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bengaluru  molestation  video footage  Bangalore badmash  

Other Articles