రాష్ట్ర ప్రభుత్వానికి పవన్ డెడ్ లైన్.. పక్షంరోజుల్లో నివేదిక.. pawan kalyan gives ultimatum to state government on kidney patients issue

Pawan kalyan gives ultimatum to state government on kidney patients issue

pawan kalyan, jana sena, janasena, janasena pawan kalyan, ichchapuram, uddanam kidney patients, separate budget, kidney patients, janasena srikakulam, pawan kalyan srikakulam

janasena party chief pawan kalyan gives ultimatum to state government on uddanam kidney patients issue, forms janasena committee on the issue

ITEMVIDEOS: రాష్ట్ర ప్రభుత్వానికి పవన్ డెడ్ లైన్.. పక్షంరోజుల్లో నివేదిక..

Posted: 01/03/2017 11:52 AM IST
Pawan kalyan gives ultimatum to state government on kidney patients issue

శ్రీకాకుళంలోని ఉద్దానం సహా 11 మండలాల్లో వున్న కిడ్నీ సమస్య భారిన పడి అనాధలుగా మారిన చిన్నారులకు ప్రభుత్వం 48 గంట్లలోగా వారికి శాంతన కలిగిస్తూ.. అదుకోవాలని ప్రముఖ సీనీనటుడు, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాన్ డిమాండ్ చేశారు. 48 గంటల్లోగా ప్రభుత్వం వారికి చేయినందించాలని, అది అర్థికంగానా.. లేక ప్రభుత్వం వారిని దత్తత తీసుకుని వారి బాగోగులు చూసుకునేలా చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.

ఉద్దానం సహా 11 మండలాల్లో వున్న కిడ్నీ సమస్యపై జనసేన పార్టీ తరపున పది మందితో కూడిన కమిటీని వేస్తున్నామని ప్రకటించారు. ఈ కమిటీ పక్షం రోజుల్లో తమకు నివేదిక అందిస్తుందని, అది రాగానే తానే స్వయంగా రాష్ట్ర ప్రభుత్వంతో ఈ విషయమై చర్చించి సమస్య పరిష్కారమయ్యే దిశగా ప్రయత్నాలు చేస్తానన్నారు. తాము ప్రభుత్వానికి నివేదిక అందించిన పక్షం రోజులలోపు ప్రభుత్వం స్పందించాలని లేని పక్షంలో కిడ్నీ సమస్యలను ప్రజాఉద్యమంగా చేపడతామని పవన్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు.

దశాబ్దాలుగా వున్న శ్రీకాకుళం కిడ్నీ సమస్య వైపు గత ప్రభుత్వాలు కన్నెత్తి చూడకపోవడం పట్ల పవన్ విస్మయం వ్యక్తం చేశారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులను కూడా రాజకీయ నేతలు, పార్టీలు కేవలం ఓటు బ్యాంకులుగానే గుర్తించి అనక వదిలేయడం ఇక జరగదని అయన హెచ్చరించారు. ‘కిడ్నీ రోగుల కోసం డయాలసిస్‌ సెంటర్లు ఏర్పాటుచేశాం’ అంటూ ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు గతంలో చేసిన వ్యాఖ్యలపై పవన్‌ మండిపడ్డారు. డయాలసిస్‌ అనేది చికిత్సకాదన్ని ఇంగితం మంత్రికి లేదా? అని ప్రశ్నించారు.

తనకు కొద్ది నెలల క్రితమే కిడ్నీ సమస్య గురించి తెలిసిందని పవన్ కళ్యాణ్ తెలిపారు. వీరి బాధలు విన్న తర్వాత తనకు చాలా బాధేసిందని అన్నారు. కృష్ణమూర్తి లాంటి వ్యక్తులు సమస్యలపై పోరటం చేసిన తీరకపోవడం విచారకరమని అన్నారు. ప్రజలను ఓటు బ్యాంక్ లా చూడకుండా వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వాలు పని చేయాలని అన్నారు. జనసేన పార్టీ ప్రజల సమస్యలపై దృష్టిసారిస్తుందని చెప్పారు. వైద్యులు తమ సాయం అందించాలని కోరుతున్నామని అన్నారు. ప్రభుత్వాన్ని అడిగితే నిధుల్లేవంటారని అన్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఈ సమస్యపై స్పందించాలని అన్నారు. ఓట్ల కోసమే ఇక్కడి వచ్చి ఆ తర్వాత ఈ సమస్యలను మర్చిపోవడం సమంజసం కాదని పవన్ కల్యాన్ అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles