చిరు విలన్ కి అన్నాడీఎంకే నుంచి బెదిరింపులు? | Anandraj receives death threat.

Anandraj receives death threat after quitting aiadmk

AIADMK Threatening Actor, Actor Anandraj, Chiru Villain threat call, senior actor quit AIADMK, Anandraj Jayalalitha, Anandraj AIADMK, Anandraj Political, Anandraj press meet, Anandraj Sasikala, Anandraj AIADMK

Actor Anandraj receives death threat complaint to chennai police after he quit AIADMK.

చిరు విలన్ కి బెదిరింపు కాల్స్

Posted: 12/30/2016 03:24 PM IST
Anandraj receives death threat after quitting aiadmk

తమిళనాట అమ్మ శకం ముగియటంతో రాజకీయంగా తీవ్ర గందరగోళం నెలకొంటోంది. శశికళకు ప్రధాన కార్యదర్శి కట్టబెట్టడం, అది నచ్చని కొందరు పార్టీ నుంచి నిష్క్రమించటం చూస్తున్నాం. అయితే జయలలితకు అత్యంత ఆప్తులుగా ఉన్నవారే పార్టీని విడిచి వెళ్తుండటమే ఇక్కడ ప్రధాన చర్చకు దారితీస్తోంది. ఇందులో పలువురు సినీ సెలబ్రిటీలు కూడా ఉన్నారు. తమిళ్ తోపాటు పలు తెలుగు చిత్రాల్లో నటించిన నటుడు ఆనంద్ రాజ్ పార్టీకి గుడ్ బై చెప్పేశాడు.

అమ్మ చనిపోయాక సరైన గౌరవం ఇవ్వటం లేదన్నది ఆయన ప్రధాన ఆరోపణ. అదే సమయంలో చిన్నమ్మపై ఆయన పరోక్ష వ్యాఖ్యలు చేశాడు. అయితే ఇప్పుడు ఆయనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయంట. గుర్తుతెలియని వ్యక్తులు చంపేస్తామంటూ ఫోన్ లో తనను బెదరిస్తున్నారంటూ నుంగంబాకం పోలీస్ స్టేషన్ లో ఆయన ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో, ఆనంద్ రాజ్ ఇంటికి పోలీసులు భద్రతను ఏర్పాటు చేశారు. అంతేకాదు, ఫోన్ ఎవరు చేశారన్న దానిపై దర్యాప్తును ప్రారంభించారు.

పార్టీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ఏమాత్రం బాగోలేవని ఆవేదన వ్యక్తం చేస్తూ పార్టీని వీడుతున్నట్లు గురువారమే ఆయన ఓ ప్రకటన చేశారు కూడా. దివంగత జయలలితకు పార్టీ నేతలు సరైన గౌరవం ఇవ్వడం లేదని... ఆమెతో ఇతరులను పోల్చడం సరికాదని పరోక్షంగా శశికళపై ఆయన కామెంట్లు చేశాడు. అంతేకాదు మంత్రులు వ్యవహరిస్తున్న తీరు కూడా బాధాకరంగా ఉందని... జయ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా వారు వ్యవహరిస్తున్నారని... ఇలాంటి చర్యలను వారు మానుకోవాలని చెప్పారు. అవసరమైతే డీఎంకే అధినేత కరుణానిధితో సమావేశమయ్యే అవకాశం వస్తే తప్పకుండా భేటీ అవుతానని చెప్పాడు. కాగా, చిరు గ్యాంగ్ లీడర్, బావబామర్ది, భాషా తదితర చిత్రాలతో తెలుగులోనూ మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actor Anandraj  AIADMK  quit  death threat  police complaint  

Other Articles