సునామీ డేంజర్.. చిలీ కి ఎందుకు ఏం కాలేదు | Earthquake of magnitude 7.7 hits southern Chile

Major quake jolts chile tourist region on christmas day

Chilean coast, Tsunami warn, Chile on Christmas Day, 7.7 magnitude quake, Chile earthquake, no deaths or major damage, Chile tremors, Chile 2016 Tsunami, Chile 2016 Earthquake

7.7 Earthquake Strikes Off Coast of Southern Chile; Tsunami Threat Issued later lifted.

భారీ భూకంపం అయినా ఎందుకు ఏం కాలేదు?

Posted: 12/26/2016 07:46 AM IST
Major quake jolts chile tourist region on christmas day

డిసెంబర్ నెల కాస్తలో మరో దేశాన్ని తీవ్ర విషాదంలో ముంచేదే. ఆదివారం భారీ భూకంపం చిలీ ని తీవ్రంగా వ‌ణికించింది. ద‌క్షిణ చిలీలోని ప్యూర్టో మాంట్ న‌గరానికి 225 కిలోమీట‌ర్ల దూరంలో భూమికి 15 కిలోమీట‌ర్ల లోతున సంభ‌వించిన ఈ భూకంప తీవ్ర‌త రిక్ట‌ర్ స్కేలుపై 7.7గా(భారీ) న‌మోదైంది. భూకంపం సంభ‌వించిన విష‌యాన్ని అమెరికా జియోలాజిక‌ల్ స‌ర్వే నిర్ధారించింది. అయితే ఇంత పెద్ద ఎత్తున్న ప్రకంపనలు వచ్చినా.. ప్రాణ నష్టం సంభవించకపోవటం విశేషం.

భూకంప కేంద్రం నుంచి వెయ్యి కిలోమీట‌ర్ల ప‌రిధిలో సునామీ హెచ్చ‌రిక‌లు జారీ చేసిన‌ట్టు అమెరికాకు చెందిన ప‌సిఫిక్ సునామీ వార్నింగ్ సెంట‌ర్ పేర్కొంది.నేవీ కూడా ఇవే హెచ్చ‌రిక‌లు చేసింది. అయితే తర్వాత కాసేపటికి పరిస్థితి సద్దుమణిగినట్లు కనిపించటంతో సునామీ హెచ్చ‌రిక‌లు వెనక్కి తీసుకుంది. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు నాలుగు వేల మందిని సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించారు. మరో 24 గంటలు అప్రమత్తంగానే ఉండాలని ప్రజలకు, అధికారులకు వాతావరణ శాఖ సూచించింది.

ఇక 2010లో చిలీలో 8.8 తీవ్ర‌త‌తో సంభ‌వించిన భారీ భూకంపం కార‌ణంగా సునామీ వ‌చ్చి 524 మంది మ‌ర‌ణించారు. గతేడాది కూడా సెప్టెంబర్ లో 8.3 తీవ్రతతో సునామీ రావటంతో 15 మంది దుర్మరణం పాలయ్యారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chile  Earthquake  Tsunami warn  

Other Articles