బతుకమ్మకి కేంద్రం నో.. అక్కడ మాత్రం కవితక్క స్టాంప్ రిలీజ్ | Centre turns down Bathukamma tableau.

Centre again turns down bathukamma tableau

Bathukamma tableau, Bathukamma Stamp, Telangana government Bathukamma tableau, Republic Day parade Bathukamma tableau, kalvakuntla kavitha Stamp, kalvakuntla kavitha Bathukamma Stamp, Bathukamma Stamp, Kavitha Bathukamma Stamp

The Defence Ministry has apparently rejected the proposal of the Telangana government on 'Bathukamma" tableau for Republic Day parade second time in a row.

కేంద్రం షాకిచ్చినా కవితక్కకి గౌరవం దక్కింది

Posted: 12/20/2016 09:21 AM IST
Centre again turns down bathukamma tableau

కేంద్ర రక్షణ శాఖ నిర్ణయంతో మరోసారి తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురైంది. వరుసగా రెండో ఏడాది బతుకమ్మ శకటానికి రిపబ్లిక్ డే పెరేడ్ పాల్గొనే అవకాశాన్ని తోసిపుచ్చింది. నిపుణుల కమిటీ వ్యతిరేకత వ్యక్తం చేసినందునే దానిని తిరస్కరిస్తున్నట్లు ప్రకటించింది.

గతేడాది కూడా ఈ శకట ప్రదర్శనకు రక్షణ శాఖ నుంచి అనుమతి లభించని విషయం తెలిసిందే. బతుకమ్మ శకటాన్ని ఈసారి రక్షణ శాఖ ప్రాథమికంగా ఆమోదించినా తుది ఎంపికలో మాత్రం తిరస్కరించినట్టు సమాచారం. ఇందుకోసం ఐదుసార్లు చర్చలు జరిపిన అధికారులు ఆడియో ట్రాక్ లో మార్పులు చేయాలని సూచించారు. ఆపై జరిగిన ఆరో సమావేశంలో కూడా అసంతృప్తి వ్యక్తం చేసి తిరస్కరించారు. అయినా రాష్ట్ర తరపు ప్రతినిధిలు మాత్రం చర్చలు జరుపుతున్నారు.

మరోవైపు రిపబ్లిక్ డే పరేడ్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రదర్శించాలనుకున్న ‘బొర్రా గుహల’ శకటాన్ని రక్షణ శాఖ ప్రాథమిక దశలోనే తిరస్కరించింది. తెలంగాణ బతుకమ్మ శకటానికి పరేడ్‌లో అవకాశం కల్పించాలని టీఆర్ఎస్ ఎంపీలు కేంద్రాన్ని కోరనున్నట్టు తెలుస్తోంది.

కవితక్క బతుకమ్మకి గౌరవం...
మరోవైపు కేంద్రం నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతన్నా ప్రతిష్టాత్మక తెలంగాణ బతుకమ్మకు ఖండాంతర ఖ్యాతి లభించింది. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కుమార్తె, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బతుకమ్మను ఎత్తుకున్న ఫొటోతో బ్రిటన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో ఓ పోస్టల్ స్టాంప్ విడుదలైంది. స్టాంప్‌పై బతుకమ్మ శుభాకాంక్షలు అని తెలుగులో రాసి ఉండడం విశేషం. ఆస్ట్రేలియాలో టీఆర్ఎస్ విభాగం అధ్యక్షుడు నాగేందర్‌రెడ్డి, అభినయ్, జాగృతి ఉపాధ్యక్షులు సోమవారం కవితను తెలంగాణలో భవన్‌లో కలిసి పోస్టల్ స్టాంప్‌ను అందజేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bathukamma tableau  Defence Ministry rejected  Kavitha Bathukamma Stamp  

Other Articles