చనిపోయిన నాన్నకు ప్రేమతో పిల్లాడి క్రిస్మస్ లేఖ.. ఏముంది? | daddy in heaven kid letter.

Child s heartbreaking letter to dead father found in field

boy letter by Balloon, dead dad letter, Boy Christmas list Dead Father, Boy Balloon letter, Hi dad letter, Kid Hi to dead dad letter, Stuart McColl letter

Child's heartbreaking Christmas letter for dead dad found tied to a balloon sparks online search.dad leave him a note under my pillow.

హాయ్ డాడ్.. కదిలిస్తున్న క్రిస్మస్ లేఖ

Posted: 12/15/2016 03:49 PM IST
Child s heartbreaking letter to dead father found in field

క్రిస్మస్ మతాలకతీతంగా ప్రపంచవ్యాప్తంగా సందడిగా జరుపుకునే ఓ పండగ. మన దేశంలో ప్రార్థనల వరకే పరిమితమైనప్పటికీ, విదేశాల్లో మాత్రం దీనికి చాలా ప్రత్యేకతలు ఉంటాయి. చిన్న పిల్లు గిప్ట్ ల కోసం శాంటాక్లాజ్ వస్తాడని, తమకు బోలెడన్నీ బహుమతులు తెస్తాడని ఎంతో ఆశగా ఎదురు చూస్తుంటారు. ఇక వారి కోరికలు తీరుస్తూ తల్లిదండ్రులు కూడా అదే రీతిలో సర్ ప్రైజ్ లు ఇస్తుంటారు కూడా. కానీ, ఇక్కడ ఓ బాలుడు తన తండ్రిని ఏం కోరుతున్నాడో తెలిస్తే కదిలిపోతారు.

తన తండ్రి లేడూ అంటూ చెబుతూనే అంతర్భావాలను హృదయాలను కలిచివేసేలా అందులో వివరించాడు. స్కాట్ లాండ్ లోని డన్ ఫెర్మ్ లైన్ లోని స్టేడియంలో స్టూవర్ట్ మెక్ కోల్ (30) అనే ఓ ఫోటోగ్రాఫర్ ఫోటోలు తీస్తుండగా నీలం రంగు బెలూన్ ఒకటి కిందపడింది. ఆ బెలూన్ కి కట్టి ఉన్న ఓ కాగితం తెరిచి చూశాడు అతగాడు. అంతే క్షణాల్లో అతని కళ్లు చెమ్మగిల్లాయి. ఇంతకీ అందులో ఏముందంటే...

'హాయ్ డాడ్..' నేను నిన్ను మిస్ అవుతున్నానని చెప్పేందుకే ఈ ఉత్తరం రాస్తున్నాను. నీకు తెలుసు, నేను అమ్మ సంరక్షణలో ఉన్నానని. అయితే, అమ్మకి ఆరోగ్యం బాగాలేదు. నా చెవి మూసుకుపోయింది. నేను నీతో పాటు, స్కూలును కూడా మిస్ అవుతున్నాను. నువ్వు స్వర్గంలో ఉన్నావని నాకు తెలుసు డాడ్...అక్కడ నువ్వు క్షేమంగా ఉన్నావా? నువ్వు రాసిన లేఖ నా దిండుకింద పెడతావని నా ఆశ. క్రిస్మస్ కు నాకు కావాల్సిన వస్తువుల జాబితా ఇదిగో...బూట్లు, బేస్ బాల్ కిట్, రిబౌండర్ నెట్, కొత్త ప్రీమియర్ లీగ్ బాల్, షార్ట్స్, రూబిక్స్ క్యూబ్, బై డాడ్... ఐ లవ్ యూ' అంటూ ముగించాడు.

Kid Christmas letter to Died Father

ఆ ఉత్తరాన్ని చదివి తాను ఉద్వేగంతో ఏడ్చేశానని స్టూవర్ట్ తెలిపాడు. డిసెంబర్ 1న ఆ ఉత్తరం రాసినట్లు ఉండగా, తనకు దొరికిన వెంటనే దానిని సోషల్ మీడియాలో పోస్ట చేశాడు. క్రిస్మస్ లోపు ఆ బాలుడ్ని వెతికి పట్టుకుని, అతను కోరుకున్న వస్తువులు అందజేయడమేనని స్టువర్ట్ లక్ష్యం. మరోవైపు సోషల్ మీడియాలో ఈ ఉత్తరాన్ని చూసిన పలువురు గిఫ్ట్ లు ఇస్తామని ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Stuart McColl  Balloon letter  

Other Articles