ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బిక్కు బిక్కుమంటూ వణికిపోతున్న ఆ మహిళకు కొరియర్ బాయ్ రూపంలో దేవుడు దిగివచ్చాడు. అయితే యముడు వెనకాలే ఉండటంతో కాస్త తెలివి ప్రదర్శించింది. అంతే తన కొడుకుతోపాటు, తన ప్రాణాలు కాపాడుకోవటమే కాదు, భర్త రూపంలో ఉన్న రాక్షసుడి నుంచి విముక్తి పొందింది. ఇంతకీ ఏం చేసింది? కొరియర్ ఆమె ప్రాణాలు ఎలా కాపాడింది? తెలుసుకోవాలంటే ముస్సోరిలో జరిగిన ఈ ఘటన తెలుసుకోండి.
ఫ్రాంక్లిన్ కంట్రీలో ఉండే ఓ జంటకి ఐదేళ్ల క్రితం వివాహం అయ్యింది. వీరికి మూడేళ్ల బాబు ఉన్నాడు. అయితే ఏం జరిగిందో తెలీదుగానీ, భర్త ఒక్కసారిగా ఉన్మాదిలా మారిపోయాడు. మూడేళ్ల పిల్లాడిని పచ్చి మంచినీళ్లు కూడా ఇవ్వకుండా వేరే గదిలో బంధించాడు. ఆమె జుట్టు పట్టుకుని నేలకేసి కొట్టాడు. కనిపించిన వస్తువుతో బాదాడు. లైంగికంగా వేధించాడు. ఇలా పదిహేను గంటలపాటు వికృత క్రీడ చేశాడు. అంతేకాదు ఓ గన్ తో ఆమె ప్రాణాలు తీసేందుకు యత్నించబోయాడు. అయితే అప్పుడే ఆమె అదృష్టం బాగుండి కొరియర్ రూపంలో ఆమె ప్రాణాలు నిలిచాయి.
ఓ కొరియర్ అర్జెంట్ గా పంపాల్సి రావటంతో భర్త యూపీఎస్ కొరియర్ కంపెనీ వాళ్లకి కబురు పంపాడు. అది కొరియర్ బాయ్ కి ఇవ్వాల్సిందిగా భార్యకు సూచించి, వెనకాలే అతనూ గన్ తో నిలుచున్నాడు. అదే మెరుపులాంటి ఆలోచన చేసిన ఆమె సంతకంతోపాటు బాక్స్ పై ‘911 (ఎమర్జెన్సీ నంబర్) కి కాల్ చేయమని’ రాసింది. బాక్స్ ని పరిశీలించిన ఆ బాయ్ ఆమె ఆపదలో ఉందని అర్థం చేసుకుని వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. వారు రంగంలోకి దిగటం ఆ శాడిస్ట్ భర్తను అరెస్ట్ చేయటం, తల్లి బిడ్డలకు విముక్తి కల్పించటం చకచకా జరిగిపోయాయి.
గొడవ ఏంటో చెప్పకపోయినప్పటికీ, సమయానికి ఆ కొరియర్ బాయ్ స్పందించకపోయి ఉంటే మాత్రం రెండు నిండు ప్రాణాలు బలయ్యి ఉండేవని ఓ పోలీస్ అధికారి తెలిపాడు. మొత్తానికి టైమ్ కి స్పందించిన ఆ కొరియర్ బాయ్ పోలీసుల దృష్టిలో హీరో అవ్వటమే కాదు, పని చేసే కంపెనీ నుంచి అభినందనలు కూడా అందుకున్నాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more