కార్డుతో కొట్టించుకుంటే.. ఇక పండగే | Discount on fuel bought by digital mode.

Discount on cashless payment for fuel starts

petrol and diesel India, Digital Payments India, Fuel Discount, Digital Payments petrol, Petrol and diesel price, e Payment for petrol, Petrol discount

Get discount on petrol, diesel by using digital payment options.

పెట్రోల్ డిస్కౌంట్ మేళా షురూ అయ్యింది

Posted: 12/13/2016 09:29 AM IST
Discount on cashless payment for fuel starts

క్యాష్ లెస్ దేశంగా భారత్ ను తీర్చిదిద్దే ప్రయత్నంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తొలి అడుగు వేసింది. ప్రజలను ఆకర్షించేందుకు డిజిటల్ చెల్లింపులపై డిస్కౌంట్లు ప్రకటించబోతుంది. ఈ పేమెంట్ల ద్వారా పెట్రోలు, డీజిల్ కొనుగోలు చేసేవారికి 0.75 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్టు పేర్కొంది. ఇది సోమవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది.

ఇంధనం కొనుగోలుతోపాటు బీమా, పాలసీలు, రైలు టికెట్లు, టోల్ చార్జీలను డిజిటల్ రూపంలో చెల్లిస్తే డిస్కౌంట్ ఇస్తామని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ కొన్ని రోజుల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే. డిజిటల్ రూపంలో చెల్లింపులు జరిగిన మూడు రోజుల్లో రాయితీ మొత్తాన్ని వినియోగదారుడి ఖాతాలో జమ చేస్తామని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సోమవారం ప్రకటించింది.

క్రెడిట్, డెబిట్, ఈ-వాలెట్లు, మొబైల్ వాలెట్ల ద్వారా పీఎస్‌యూ (ఐవోసీ, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్) బంకుల్లో చేసిన కొనుగోళ్లకు రాయితీ వర్తిస్తుందని వివరించింది. దీని ప్రకారం లీటరు పెట్రోలుపై 49 పైసలు, లీటరు డీజిల్‌పై 41 పైసలు రాయితీ రూపంలో తిరిగి వినియోగదారుడి ఖాతాలోకి చేరనున్నంద మాట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Digital Payment India  Petrol and Diesel payments  Discounts  

Other Articles