చర్చి కూలి 160, పేలుడుతో 25 మంది దుర్మరణం | Church Mishaps in Nigeria and Eygpt.

185 died in nigerian church collapses and cairo church blast

Nigeria church collapse, Cairo Bomb Blast, Church Blasts, Church Mishaps, Church Car Bomb Blast, Cairo Car Blast, Church worshipers killed.Nigerian church Mishap, Cairo Church Mishap

Nigeria church collapse kills 160 worshipers. church bombing in Egypt killed 25.

చర్చి కూలి, పేలి 185 మంది దుర్మరణం

Posted: 12/12/2016 08:26 AM IST
185 died in nigerian church collapses and cairo church blast

క్రిస్మస్ వేడుకలు ఓవైపు ప్రపంచవ్యాప్తంగా అట్టహాసంగా జరుగుతుంటే ఆ రెండు దేశాల్లో మాత్రం తీవ్ర విషాదాన్ని నింపాయి. నైజీరియాలో చర్చి పైకప్పు కూలి 160 మంది మృత్యువాత పడగా, ఈజిప్ట్ లో ఓ చర్చి వద్ద పేలుడు జరిగి 25 మంది చనిపోయారు.

ఈజిప్టు రాజధాని కైరోలో చర్చి వద్ద బాంబు పేలిన సంఘటనలో 25 మంది మృతి చెందగా, 35 మంది గాయపడ్డారు. చర్చి ఆవరణలో అమర్చిన బాంబును పేల్చి ఈ దారుణానికి పాల్పడ్డారని కొందరు ప్రత్యక్షసాక్షులు చెప్పారు. బాంబు పేలుడు అనంతరం, రక్తసిక్తంగా మారిన ఈ ప్రాంతంలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. మృతుల్లో మహిళలు కూడా ఉన్నారు. ఈ సంఘటనకు ఎవరు బాధ్యులనే విషయం ఇంకా తెలియలేదు.

Egypt Church Blast

పైకప్పు కూలి సమాధి...
ఆగ్నేయ నైజీరియాలోని ఉయో ప్రాంతంలో విషాదం చోటు చేసుకుంది. ఆదివారం ప్రార్థనల సమయంలో ఓ చర్చి పై కప్పు ఒక్కసారిగా కూలిపోవడంతో 160 మంది ప్రాణాలు శిథిలాల కింద సమాధి అయ్యాయి. తొలుత సహాయక సిబ్బంది 60 మృతదేహాలను వెలికి తీయగా ఆపై ఆ లెక్క 160కి చేరింది. ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్యను వైద్యులు అధికారికంగా ప్రకటించారు. ప్రమాదం జరిగిన సమయంలో చర్చిలో వందల సంఖ్యలో ప్రజలు ఉన్నట్టు తెలుస్తోంది. నిర్మాణ దశలో ఉన్న ఈ చర్చిని ప్రత్యేక ప్రార్థనల కోసమని వేగంగా ముగించేసినట్టు సమాచారం.

కాగా, భద్రతా ప్రమాణాలను గాలికొదిలేశారా అన్న విషయమై దర్యాప్తు చేస్తామని రాష్ట్ర గవర్నర్ ఉదోమ్ ఎమాన్యుయేల్ ప్రకటించారు. ఈ దుర్ఘటన పట్ల దేశాధ్యక్షుడు ముహమ్మద్ బుహారి విచారం వ్యక్తం చేశారు. గతంలో 2014 లాగోస్‌లోని సినగోగ్ చర్చికి చెందిన బహుళ అంతస్తుల అతిథి గృహం కూలిపోవడంతో 116 మంది చనిపోయిన ఘటన తెలిసిందే.

Church Seal Collapse

Church Collapse Nigeria

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nigeria Church Collapse  Cairo Church Blast  

Other Articles