రూ. కోటి కావాలా.. కార్డుతో చెల్లింపులు చేయండి చాలు.. Rs 1 Crore e-payments contest participate Niti Aayog

Rs 1 crore e payments contest participate niti aayog

higher denomination banknotes, demonetisation, electronic payment, customers, special scheme, variety of attractions, SBI, Punjab National Bank, Canara Bank, Bank of Baroda, Union Bank of India, Bank of India, ICICI Bank, Sea Bank, Citibank, HSBC, NPCI

A special scheme has been found to develop. to promote e-payments with one crore reward offers a variety of attractions, including presence information.

కోటి రూపాయలు కావాలా.. కార్డుతో చెల్లింపులు చేయండి చాలు..

Posted: 12/11/2016 10:15 AM IST
Rs 1 crore e payments contest participate niti aayog

పెద్ద నోట్లను రద్దు చేసిన అనంతరం కరెన్సీ కోసం కష్టాలు పడుతున్న ప్రజలను ఓదర్చాడంతో పాటు.. నగదు రహిత లావాదేవీలు పెంపోందించేందుకు కేంద్ర ప్రభుత్వం కోటి రూపాయల బంపర్ ఆఫర్ అందించనుంది. అయితే కోటి రూపాయల కోసం ఎన్ని పాట్లు పడాలి అనే అలోచన వద్దు. ఎందుకంటే ఇందుకోసం మీరు చేయాల్సిందేమీ వుండదట. కేవలం మీ వద్దనున్న బ్యాంక్ డెబిట్ కార్డులతో చెల్లింపులు చేస్తే చాలట. నిత్యావసర సరుకులు కొనుగోలు చేసినా, లేక ఇతర వస్తువులు కోనుగోలు చేసినా.. కార్డులను వినియోగించిన వారికి ఈ అవకాశం లభించనుంది.

ఈ మేరకు ఓ సరికోత్త స్కీంను ప్రకటించే పనిలో నీతి ఆయోగ్ తనమునకలై వుంది. అధిక విలువ కలిగిన నోట్ల రద్దు అనంతరం ఎలక్ట్రానిక్ పేమెంట్లను చేస్తున్న వినియోగదారులకు ఈ ఆఫర్ ను వర్తింపజేయాలనే నిర్ణయానికి వస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం ఓ ప్రత్యేక పథకం రూపొందిస్తున్నట్లు తెలిసింది. ఇందులో రూ.కోటి నగదు బహుమతితో పలు రకాల ఆకర్షణీయ ఆఫర్ లు ఉన్నట్లు సమాచారం. పథకం రూపొందించడంలో కీలక భూమిక పోషించాలని నేషనల్ పేమెంట్ కార్పొరరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్ పీసీఐ)ను నీతి ఆయోగ్ కోరినట్లు తెలిసింది.

అంతేకాకుండా నేషనల్ ఫైనాన్షియల్ ఇంక్లూసన్ ఫండ్ నుంచి రూ.125కోట్లను ఎన్ పీసీఐకు నీతిఆయోగ్ కేటాయించింది. ఎస్ బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్, సిటీ బ్యాంకు, హెచ్ఎస్ బీసీ బ్యాంకుల రీటైల్ పేమెంట్లన్నీ ఎన్ పీసీఐ పరిధిలోనే జరుగుతాయి. ముఖ్యంగా గ్రామీణ, చిన్న పట్టణాల ప్రాంతాల ప్రజలను ప్రోత్సహించేందుకే ఈ పథకాన్ని ప్రవేశపెడుతన్నట్లు తెలుస్తుంది. దేశంలో జరిగిన అన్ని నగదు రహిత లావాదేవీల ఐడీలను ప్రతి మూడు నెలలకు ఒకసారి డ్రా తీసి రూ.కోటి బహుమతిని, ప్రతి వారం తీసే డ్రాలో రూ.10లక్షల బహుమతిని అందజేస్తారని తెలిపారు. ప్రతివారం పది మంది వినియోగదారులకు, పది మంది వ్యాపారులకు బహుమతులు ఇవ్వనున్నట్లు సమాచారం

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : niti aayog  e-payments  bumper offer  npci  demonetisation  

Other Articles