పంజా విసురుతున్న చలిపులి.. కనిష్టస్థాయికి పడిపోతున్న ఉష్ణోగ్రతలు mercury dips in telugu states, minimum temperatures registered

Mercury dips in telugu states minimum temperatures registered

mercury, minimum temperature, Adilabad, cold wave, IMD, Indian Meterological department, medak, agency areas, mercury dips

mercury dips to 2 to 4 celcius in telugu states, whereas adilabad records a low of 6 degress and medak 8 degrees celcius

పంజా విసురుతున్న చలిపులి.. కనిష్టస్థాయికి పడిపోతున్న ఉష్ణోగ్రతలు

Posted: 12/11/2016 08:50 AM IST
Mercury dips in telugu states minimum temperatures registered

చలిపులి పంజా విసురుతోంది. ఉదయం తొమ్మిది గంటల వరకు కూడా చలి వీడటం లేదు. దీంతో తెలుగురాష్ట్రాలలో ఉష్ణోగ్రతలు కనిష్టస్థాయికి పడిపోతున్నాయి,  రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతూ.. అత్యంత కిందకు దిగజారుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల మేర తగ్గాయి. ఆదిలాబాద్‌లో అత్యంత తక్కువగా 6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్‌లో ఇదే అత్యంత తక్కువ ఉష్ణోగ్రత కావడం గమనార్హం. అక్కడ పగటి ఉష్ణోగ్రత 28 డిగ్రీలుగా నమోదైంది. పగటి ఉష్ణోగ్రతకు రాత్రి ఉష్ణోగ్రతకు మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోంది.

మెదక్‌లోనూ కనిష్ట ఉష్ణోగ్రత 8 డిగ్రీలు రికార్డయింది. అక్కడ సాధారణం కంటే 4 డిగ్రీలు తక్కువగా రాత్రి ఉష్ణోగ్రత రికార్డయింది. హైదరాబాద్, నిజామాబాద్‌ల్లో 12 డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హకీంపేట, హన్మకొండ, ఖమ్మం, రామగుండంలలో 13 డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆది, సోమవారాల్లోనూ రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొని ఉంటుందని, దీంతో రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు తుపాను కారణంగా ఈనెల 13, 14 తేదీల్లో రాష్ట్రంలో అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

అటు మన్యం జిల్లాలు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళంలోని మన్యం ప్రాంతాల్లో కూడా మంచు దుప్పటి కప్పుకుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు అలుముకుంది. పొగమంచు కారణంగా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం వాటిల్లింది. దీంతో పర్యటకులతో పాటు స్ధానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. క్రితం రోజు రాత్రి లంబసింగిలో 11 డిగ్రీలు, పాడేరు, చింతపల్లిలో 13 డిగ్రీలు, మోదుకొండమ్మ పాదాల వద్ద 12 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles