ఇల్లు కూల్చేయాలన్న అధికారులతో ఆ మంత్రి ఏం చెప్పాడంటే... | Kerala minister OK for his house demolish.

Kerala minister consent to demolish his house

Kerala minister house, Public works minister G Sudhakaran, Minister Sudjhakaran, Sudhakaran to lose house, Kerala miniister Sudhakaran, Minister lose house road widing

Kerala minister Sudhakaran to lose house to road widening.

ఆ మంత్రి నిర్ణయం అధికారులకు షాకిచ్చింది

Posted: 12/10/2016 08:17 AM IST
Kerala minister consent to demolish his house

అధికారంలో చేతిలో ఉందని అజమాయిషీ చెలాయించటం, ఎడాపెడా అవినీతితో డబ్బును వెనకేసుకోవటం ఇంతకాలం ఇలాంటి నేతలనే చూస్తూ వస్తున్నాం. అయితే అడపా దడపా నూటికో, కోటికో మచ్చలేని వాళ్లని కూడా చూశామనుకోండి. కానీ, జనం కోసం, తమ రాష్ట్రాభివృద్ధి కోసం ఎంత మంది నిజంగా పాటుపడుతున్నారో వారి మన సాక్షికే తెలియాలి.

కానీ, ఒక విషయమై కేరళ పబ్లిక్ వర్క్స్ మంత్రి సుధాకరన్ తీసుకున్న నిర్ణయం గురించి తెలుసుకుంటే, ఆయన్ని ప్రజల మనిషి అని ఎవరైనా అభినందిస్తారు. కేరళలోని కాజకూట్టం-చేర్టాల మధ్య జాతీయ రహదారిని ఇటీవల వెడల్పు చేయాలని నిర్ణయించారు. ఈ పనులను నేషనల్ హైవే అథారిటీ అధికారులు చేపట్టారు. అయితే, అలప్పుజలో తూక్కుకుళం వద్ద ఈ పనులు నిర్వహించాలంటే సదరు అధికారులు కొంచెం జంకారు. ఎందుకంటే, ఆ రాష్ట్ర మంత్రి సుధాకరన్ కు సంబంధించిన ఇల్లు అక్కడే ఉంది.

రోడ్డు విస్తరణ పనుల్లో ఆయన ఇల్లు ధ్వంసమవుతుందని, వెంటనే ప్లాన్ మార్చేసి, రోడ్డుకు అవతల ఉన్న మరో వ్యక్తి ఇల్లును కూల్చేందుక సిద్ధం అయ్యారు. అయితే, అధికారుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న సుధాకరన్ మాత్రం వారి తీరుపై మండిపడ్డాడు. ‘రోడ్డు విస్తరణ పనుల్లో నా ఇల్లు పోయినా ఫర్వాలేదు. కానీ, ప్లాన్ మాత్రం మార్చకండి’ అని సంబంధిత అధికారులకు ఆయన సూచించారు. దీంతో అధికారులు కంగుతిన్నారంట.

తన స్వార్థం కోసం రోడ్డు విస్తరణ పనుల ప్లాన్ మార్చితే కనుక, రోడ్డు అవతలి వైపు ఉండే వ్యక్తి ఆధారం కోల్పోతాడని చెప్పి తన ఇల్లు పోయినా ఫర్వాలేదు ముందుకెళ్లండని ఆదేశించాడంట. దీంతో మంత్రి ఇల్లును కూల్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు. నిజమైన నేతగా ఇప్పుడు ప్రజల మన్ననలు అందుకుంటున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kerala  Public works minister  G Sudhakaran house  

Other Articles