త్యాగి చివరకు పాపం పండింది | Former Air Chief SP Tyagi Arrested By CBI

Former air force chief sp tyagi arrested in agustawestland

AgustaWestland Scam Case, Former Air Force chief SP Tyagi, SP Tyagi Arrest, AgustaWestland case details, AgustaWestland case Sonia and Rahul, AgustaWestland case arrests, AgustaWestland Scam details, AgustaWestland case, Air Force chief SP Tyagi, IAF chief Tyagi, Former IAF chief Tyagi

Former Air Force chief SP Tyagi arrested by CBI in AgustaWestland case.

సంచలన కుంభకోణంలో త్యాగి అరెస్ట్

Posted: 12/09/2016 06:16 PM IST
Former air force chief sp tyagi arrested in agustawestland

దేశంలో ప్రకంపనలు రేపిన ఆగస్టా వెస్ట లాండ్ కుంభకోణంలో మాజీ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎస్పీ త్యాగిని శుక్రవారం అరెస్ట్ చేశారు. సుమారు 3700 కోట్ల ఈ స్కాంలో ఆయన హస్తం ఉన్నట్లు సీబీఐ ధృవీకరించింది. సంచలనం రేపిన ఈ భారీ కుంభకోణంలో త్యాగిని ఇప్పటికే పలుమార్లు విచారించిన ఈడీ కూడా మనీలాండరింగ్ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఆరోపణలు రుజువుకావటంతో ఆయన్ని అరెస్ట్ చేసింది.

డీల్ కోసం సంప్రదింపులు జరిపే సమయంలో ఎస్పీ త్యాగిని ఇటలీ మధ్యవర్తులు కోడ్ నేమ్ తో సంబోధించే వారనిట. తమ సంభాషణల్లో త్యాగిని 'అపురూప లావణ్యవతి' (ఇటలీ భాషలో గియులి లేదా గియులియా)గా సంబోధించేవారని ఇదివరకే సీబీఐ బయటపెట్టింది. మార్చి 25, 2012లో వీరిద్దరినీ మిలాన్ లోని మల్పెన్సా ఎయిర్ పోర్టులో త్యాగి కలుసుకున్నాడని సీబీఐ, ఈడీ అధికారులు సేకరించిన పత్రాల్లో తెలిపింది. " ఆపై తిరిగి వెళుతూ, చాపర్ డీల్ లో ఇటలీ విచారణ పట్ల గియులియా ఆందోళన వ్యక్తం చేశారు" అని ఆ పత్రాల్లో ఉన్నట్టు సమాచారం.

ఇదే కేసులో ఇప్పటిదాకా 13 మందిని విచారించిన సీబీఐ ఎయిర్ మార్షల్ చీఫ్ గా ఉన్న సమయంలో త్యాగి ఆగస్టా మాతృక కంపెనీ ఫిన్ మెక్కానియాను సందర్శించాడన్న ఆధారాలు ఉన్నట్లు తెలిపింది. హెలికాఫ్టర్ల ఎత్తు ఆరు వేల నుంచి 4000 ఉండాలని తయారీ కంపెనీకి ఆయన సూచించనట్లు వివరించింది. ఈ స్కాంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ హస్తం ఉందని బీజేపీ ఆరోపణలు చేయగా, పలువురు గవర్నర్ల పాత్రపై అనుమానం వ్యక్తం చేసిన నిఘా వ్యవస్థ ఇదివరకే వారిని విచారించింది. హెలికాప్టర్ల సర్వీస్ పరిమితికి సంబంధించి చేసిన మార్పులపై ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) మాజీ డెరైక్టర్, ప్రస్తుత ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌ కూడా అందులో ఉన్నారు.

ఆగస్టా ఎందుకోసం...

అత్యంత ప్రముఖుల ప్రయాణాల కోసం అవసరమైన 12 అత్యాధునిక హెలీకాప్టర్లను కొనుగోలు చేయాలని 2005లో యూపీఏ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆంగ్లో-ఇటాలియన్ కంపెనీ అగస్టా వెస్ట్‌ల్యాండ్‌తో ఒప్పందం కుదిరింది. అగస్టాతో ఒప్పందం కుదిరేలా నిబంధనల్లో మార్పుచేర్పులు చేసేందుకు గాను భారతీయ అధికారులకు రూ.360 కోట్ల మేర ముడుపులు ముట్టినట్టు ఇటలీ దర్యాప్తు అధికారులు ఆరోపించిన నేపథ్యంలో ఈ కుంభకోణం వెలుగుచూసింది.
 
దర్యాప్తు చేపట్టిన సీబీఐ వైమానిక దళ మాజీ అధిపతి ఎస్పీ త్యాగితో పాటు మరో 13 మందిపై కేసు నమోదు చేసింది. ఇందులో త్యాగి సమీప బంధువులతో పాటు ఈరోపియన్ దళారులు కొందరు ఉన్నారు. తనపై వచ్చిన ఆరోపణలను త్యాగి ఖండించగా, సీబీఐ ప్రశ్నించిన తర్వాత గవర్నర్లుగా ఉన్న నారాయణన్, వాంచూలు తమ పదవులకు స్వచ్ఛందంగా రాజీనామాలు సమర్పించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Former IAF chief Tyagi  AgustaWestland Scam  CBI arrest  

Other Articles