క్యాష్ లెస్ సోసైటీ అంటే అర్థం... | Cashless meaning changed.

No cash in atm in hyderabad

Demonetization, Cashless meaning, Cashless society, Cashless society meaning changed, No cash in ATM, No Cash Board, ATM No cash board, Cashless society meaning

Demonetization effect No cash in ATM in Hyderabad.

అసలు క్యాష్ లెస్ సోసైటీ అంటే ఏంటి?

Posted: 12/09/2016 03:15 PM IST
No cash in atm in hyderabad

పాత కరెన్సీ రద్దు తర్వాత విమర్శలను ఎదుర్కునే క్రమంలో ప్రభుత్వం చెబుతున్న ఒకే ఒక మాట క్యాష్‌లెస్ సొసైటీ. గత వారం రోజులుగా ప్రధాని సహా ఆర్థిక మంత్రిత్వశాఖ ఊదరగొడుతున్న ఈ పదానికి అర్థం ఏమిటి? ఏముంది డెబిట్, క్రెడిట్ కార్డులతో నగదు చెల్లింపులు కానిచ్చేయటమే అంతే కదా! కానీ, దీనికి ఇప్పుడు కొత్త అర్థం వెతుకొవాల్సి వస్తోంది దేశ ప్రజలు. పెద్ద పెద్ద పట్టణాల దగ్గరి నుంచి అన్ని ప్రాంతాల్లో క్యాష్‌లెస్ ఏటీఎంలు మాత్రం దర్శనమిస్తున్నాయి. దీంతో క్యాష్‌లెస్ సొసైటీ అంటే క్యాష్‌లెస్ ఏటీఎంలే అని పలువురు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

నోట్ల రద్దు తర్వాత ప్రభుత్వం పలు ప్రకటనలు చేసింది. ఇందులో నిబంధనల సడలింపు నుంచి రాయితీల వరకు ఉన్నాయి. కాగా గురువారానికి నోట్ల రద్దు నిర్ణయం తీసుకుని నెలరోజులు అయింది. అయినా పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు లేదు. బ్యాంకుల ముందు క్యూలు కానీ, ప్రజల ఇబ్బందుల్లో మార్పు కానీ ఇసుమంతైనా కనిపించలేదు. నోట్ల రద్దు తర్వాత దేశంలోని 2.2 లక్షలకుపైగా ఉన్న ఏటీఎంలలో 95 శాతం రీక్యాలిబరేషన్ చేశామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే నిజానికి ఇది శుద్ధ అబద్ధమని తేలిపోయింది.

ఓ ప్రముఖ దినపత్రిక చెందిన పలువురు జర్నలిస్టులు కొందరు గురువారం దేశవ్యాప్తంగా 13 నగరాల్లోని 647 ఏటీఎంలను సందర్శించారు. ఇందులో తేలిందేంటంటే.. వీటిలో 69.7 శాతం ఏటీఎంలు పూర్తిగా పనిచేయడం లేదని! దీంతో నోట్ల రద్దు నిర్ణయానికి ముందు ప్రభుత్వం సరైన ప్రణాళికలు రూపొందించలేదని తేలిపోయింది. అయితే ఈ ఆరోపణలను ప్రభుత్వం తొలినుంచీ కొట్టి పడేస్తూ వస్తోంది.

నోట్ల రద్దు తర్వాత ఎక్కువ ఇక్కట్లకు గురవుతున్నది గ్రామీణ ప్రజలే. చాలా గ్రామాల్లో బ్యాంకులు లేకపోవడం, ఏటీఎంలు అందుబాటులో లేకపోవడంతో వారి కష్టాలు మరింత ఎక్కువయ్యాయి. కాగా బెంగళూరు, హైదరాబాద్, చెన్నై తదితర నగరాల్లో ఏటీఎంలు దిష్టిబొమ్మలుగా మారాయి. ఇక పనిచేయని ఏటీఎంల విషయంలో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ 50 ఏటీఎంలలో 49 ఏటీఎంల వద్ద ‘నో క్యాష్’, ‘అవుటాఫ్ ఆర్డర్’ బోర్డులే దర్శనమిస్తుండడం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Demonetization  Cashless meaning  No cash in ATM  

Other Articles