హైదరాబాద్ లో కూలిన ఏడంతస్థుల భవనం | At least 10 feared dead in building collapse, one body found.

7 storey building collapses in hyderabad

7 storey buliding Collapse, building collapses Hyderabad, Nanakramguda building incident

Building collapses in Hyderabad, 10 feared trapped; second incident within months.

ITEMVIDEOS:హైదరాబాద్ లో కుప్పకూలిన భవనం.. 10 మంది మృతి?

Posted: 12/09/2016 08:41 AM IST
7 storey building collapses in hyderabad

హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో పెను విషాదం చోటు చేసుకుంది. గురువారం రాత్రి నిర్మాణంలో ఉన్న ఓ ఏడంతస్తుల భవనం కుప్పకూలింది. శిథిలాల కింద నాలుగు కుటుంబాలకు చెందిన 13 మంది కూలీలు చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. సహాయక సిబ్బంది ఇప్పటి వరకు ఓ మహిళ, చిన్నారిని రక్షించారు. బాధిత కూలీలందరూ విజయనగరం, చత్తీస్‌గఢ్‌లకు చెందిన వారుగా గుర్తించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం పైప్ ద్వారా ఆక్సిజన్ పంపిస్తున్నారు. సహాయక చర్యలు రాత్రి నుంచి నిరాటంకంగా కొనసాగుతున్నాయి.

భవనం కుప్పకూలిన విషయం తెలుసుకున్న మంత్రులు నాయిని నరసింహారావు, పద్మారావు, మేయర్ బొంతు రామ్మోహన్‌రావు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అనుమతి లేకున్నా ఏడంతస్తులు కట్టడంతోపాటు నాసిరకం నిర్మాణం కారణంగానే బిల్డింగ్ కూలిపోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ కట్టడానికి అనుమతులు లేవని ఆయన తెలిపారు.

 

జీహెచ్ఎంసీ కేవలం రెండు అంతస్థుల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేస్తే...యజమాని దీనిని ఏడు అంతస్తుల నిర్మాణం చేపట్టాడని అన్నారు. అయితే ఇది శల్యపరీక్షకు సమయం కాదని, ముందు శిధిలాల తొలగింపు జరగాలని, ఆ పనులు పర్యవేక్షిస్తున్నామని ఆయన తెలిపారు. సుమారు నాలుగు కుటుంబాలకు చెందిన 13 మంది చిక్కుకుపోయారని తెలుస్తోంది. వీరిలో ఎక్కువ మంది విజయనగరం జిల్లా బలిజపేట మండలం చిలకలపల్లి గ్రామానికి చెందిన వారని తెలుస్తోందని ఆయన చెప్పారు.

శిధిలాలకింద చిక్కుకున్న తల్లీబిడ్డను రక్షించామన్న ఆనందంలో ఉండగానే ఒక వ్యక్తి మృతదేహం లభించడం అక్కడున్న వారిని కలచివేసింది. బిల్డింగ్ యజమాని ‘గుడుంబా డాన్’ సత్తూ సింగ్ అలియాస్ సత్యనారాయణ చేసిన తప్పిదానికి అన్యాయంగా పద మూడు మంది ప్రమాదంలో పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా, ఈ జూలైలో ఫిల్మ్ నగర్ లో అక్రమంగా నిర్మిస్తున్న ఓ భవనం కుప్పకూలి ముగ్గురు కూలీలు మృతి చెందిన విషంయ తెలిసిందే. ఎలాంటి ముందస్తు అనుమతులు తీసుకోకుండా ఇలాంటి అక్రమ నిర్మాణాలు చేపట్టడం, పైగా నిబంధనలు పాటించకపోవటంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : storey buliding  Construction building collapses  

Other Articles