తలాక్, తలాక్, తలాక్.. రాజ్యాంగ విరుద్దం.. Triple Talaq is unconstitutional

Triple talaq in violation of rights of muslim women unconstitutional

Allahabad High Court, Allahabad HC, Muslim women, triple talaq, unconstitutional, women rights, All India Muslim Personal Law Board

The Allahabad High Court declared that the Islamic practice of divorcing a woman by saying out aloud "talaq" thrice is in violation of the Constitution.

తలాక్, తలాక్, తలాక్.. న్యాయస్థానం సంచలన తీర్పు..

Posted: 12/08/2016 04:22 PM IST
Triple talaq in violation of rights of muslim women unconstitutional

పరాచకానికి అన్న, సరాదాగా అన్న.. తప్పిదారి అన్న.. వదిలించుకునేందుకు అన్న.. ఒక్కసారి నోటి వెంట ఆ ఒక్క పదం మూడు సార్లు వచ్చిందంటే చాలు పచ్చని సంస్కారంలో చిచ్చు లేచినట్లే. అప్పటి వరకు సంతోషంగా కోనసాగుతున్న దాంపత్య జీవితంలో నిప్పులు పోసినట్లే. అయితే ఈ పదం మూడు సార్లు వరుసగా ఉచ్చరించిన క్రమంలో నిజానికి బాధపడే వరు మాత్రం అధికంగా మహిళలే. ఈ విషయాన్ని గ్రహించిన అలహాబాద్ రాష్ట్రోన్నత న్యాయస్థానం.. సంచలన తీర్పును వెలువరించింది.

ట్రిపుల్ తలాక్ పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. రాజ్యాంగపరంగా ట్రిపుల్ తలాక్ ఆమోదయోగ్యం కాదని, దీన్ని ఎవరూ ఆచరించాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది. రాజ్యాంగం మహిళలకు కల్పించిన హక్కులను కాలరాల్చేవిధంగా పర్సనల్ లాబోర్డు వ్యవహరించకూడదని న్యాయస్తానం స్పష్టం చేసింది. మహిళల హక్కులను ఉల్లంఘించే ట్రిపుల్ తలాక్ అనే పద్దతిని పాటించడం చెల్లుబాటు కాదని, దానిని పాటించాల్సిన అవసరం కూడా లేదని చెప్పింది.

రాజ్యాంగానికి ఎవరూ అతీతులు కారని, ఎవరైనా రాజ్యాంగానికి లోబడే నిర్ణయాలు తీసుకోవాలని రాష్ట్రోన్నత న్యాయస్థానం తెలిపింది. ముఖ్యంగా చట్టబద్దత లేని ట్రిఫుల్ తలాక్ పద్దతులను ఎవరూ పాటించవద్దని సూచించింది. కేవలం నోటిమాట ద్వారా విడాకులు ఇచ్చేస్తే మహిళలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని పలువురు వాదిస్తున్న క్రమంలో న్యాయస్థానం సంచలన తీర్పును వెలువరించింది. అయితే అలహాబాద్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ముస్లిం లా బోర్డులు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో సవాలు చేసే అవకాశం ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles