‘నోట్ట రద్దు’ నెల పండగ.. శుభవార్త అందించిన కేంద్రం Tax Break On Card Payments Upto Rs. 2,000

Tax break on payments upto rs 2 000 if you use card not cash

service tax on debit card, demonetisation, Credit card service tax, Debit Card, Cashless economy, Service tax, Notes Ban, Narendra Modi, Reserve Bank of India,debit card, credit card, demonetisation, service tax, digital transactions, initiative, cashless economy, Banks, ATM centres, cash

It's a good news to all the debit card and credit card holders who prefer purchasing using their cards, you will not be charged any service tax upto Rs. 2,000.

‘నోట్ల రద్దు’ నెల పండగ.. శుభవార్త అందించిన కేంద్రం..

Posted: 12/08/2016 01:18 PM IST
Tax break on payments upto rs 2 000 if you use card not cash

నవంబర్ 8న పెద్దనోట్లు రద్దు చేస్తున్నట్లు ప్రధాని దేశ ప్రజలనుద్దేశించి చేసిన ప్రసంగంలో తెలిపి ఇవాళ్టికి సరిగ్గా నెల రోజులు కావస్తున్న నేపథ్యంలో దీనిని పండగలా దేశ ప్రజలు భావించేందుకు వీలుగా కేంద్రం ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్ దేశాన్ని క్యాష్ లెస్ ఎకానమీ దేశంగా, డిజిటల్ మనీ దిశగా ప్రజలను ప్రోత్సహించే క్రమంలో భాగంగా కార్డు చెల్లింపులు చేసేవారందరికీ ఇకపై శుభవార్తను అందించింది.

ప్రధాన మంత్రి తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం నెల రోజులు పూర్తి చేసుకున్న క్రమంలో పార్లమెంటు అవరణలో విపక్షాలు నెల మాసికం అంటూ నిరసన కార్యక్రమానికి తెరతీయగా, దేశ ప్రజలకు మాత్రం కేంద్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది. నగదురహిత లావాదేవీల దిశగా వడివడిగా అడుగులు వేస్తున్న కేంద్రం.. డెబిట్, క్రెడిట్ కార్డుల వినియోగంతో డిజిటల్ మనీ చేసే ప్రజలకు ప్రోత్సాహాకాన్ని అందిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ఈ రోజు నుంచే అమల్లోకి రానుందని కూడా కేంద్రం తెలిపింది.

క్రెడిట్, డెబిట్ కార్డులతో లావాదేవీలు జరిపే సామాన్యులకు ఈ నిర్ణయం తీపి కబరును అందించింది. రూ. 2 వేల లోపు జరిపిన లావాదేవీపై సర్వీస్ టాక్స్ ను రద్దు చేసింది. జూన్ 2012 నాటి సర్వీస్ టాక్స్ నోటిఫికేషన్ ను మార్చనున్నట్టు తెలిపిన కేంద్రం.. రూ.2000 లోపు లావాదేవీలపై విధించే 14.5శాతం పన్నును ఇకపై మినహాయించింది. ఈ మేరకు పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నోటిఫికేషన్ ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ వర్గాలు తెలిపాయి.

నగదుకొరతతో ఇబ్బందులు పడుతన్న దేశ ప్రజలను డిజిటల్ చెల్లింపులకు అలవాటుపడే విధంగా ఈ ప్రోత్సహాకాన్ని కల్పించడడంతో మరింత ప్రయోజకరంగా వుంటుందని.. దీంతో నగదు రహిత చెల్లింపుల దిశగా ప్రజలు మక్కువ చూపుతారని కూడా కేంద్రం భావిస్తుంది. దీనికి తోడు ఇకపై రూ.2000 రూపాయల లోపు చెల్లింపుల్లో ఎలాంటి ఓటీపీ( వన్ టైమ్ పాస్‌వర్డ్) అవసరంలేదని ఆర్బీఐ తేల్చేసింది. వన్ టైమ్ రిజిస్ర్టేషన్ ప్రక్రియ ద్వారా కార్డుహోల్డర్లు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని వెల్లడించింది

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles