హైదరాబాదీ సాహసనారి శవంగా తిరిగొచ్చింది.. ఏం జరిగింది? | Trekker from Hyderabad found dead at Panvel peak.

Body of missing hyderabad woman found in raigad

Rachita Gupta Kanodia, Trekker from Hyderabad, Hyderabad Trekker, Rachita missing, Rachita death mystery, Rachita Gupta Kanodia news, Woman Trekker dead, Rachita trekker missing, mountaineer Rachita

Hyderabad based mountaineer Rachita Gupta Kanodia found dead at Prabalagad

ఒంటరిగా వెళ్లింది.. శవంగా తిరిగొచ్చింది...

Posted: 12/08/2016 08:56 AM IST
Body of missing hyderabad woman found in raigad

ఆమెకు సాహసాలంటే ప్రాణం. అలాంటిది పక్షం రోజులుగా జాడ లేకుండా పోవటంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా రాయ్‌గఢ్ వెళ్లినట్టు గుర్తించిన పోలీసులు సెల్‌ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా ఆమె ప్రబల్‌గడ్ పరిసరాల్లో ఉన్నట్టు తెలుసుకుని అక్కడ గాలింపు చర్యలు చేపట్టారు. వారం రోజుల తర్వాత ఆమె ప్రబల్‌గఢ్ కొండ దిగువన శవమై కనిపించారు.

హైదరాబాద్‌కు చెందిన పర్వతారోహకురాలు రచిత మిస్సింగ్ మిస్టరీ ఇలా విషాదంగా వీడింది. నగరంలోని హైదర్‌గూడ అవంతినగర్‌లో నివసించే రచిత గత కొన్ని రోజులుగా కనిపించడం లేదని నవంబరు 29న ఆమె మామ మహేశ్ గుప్తా కనోడియా, తిరుమలగిరిలో నివసించే ఆమె తండ్రి సజ్జన్ గుప్తాలు నారాయణగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. రచిత గత నెల 25న హైదరాబాద్ నుంచి పన్వేల్ చేరుకున్నారు. 29న కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడారు. దుబాయ్‌లో ఉన్న భర్తకు మహారాష్ట్రలోని ప్రబల్‌గఢ్ కొండ చిత్రాలను వాట్సాప్ ద్వారా పంపారు.

రచిత గతంలో ఇదే కొండను అధిరోహకుల బృందంతో కలిసి కొంతవరకు అధిరోహించారు. 25న ముంబైకి వెళ్లిన రచిత.. విమానాశ్రయం నుంచి క్యాబ్‌లో వెళ్లినట్లుగా సీసీ కెమెరా దృశ్యాల ద్వారా గుర్తించారు. క్యాబ్‌ నంబరు ఆధారంగా ఆ రోజు ఆమె రాయ్‌ఘడ్‌ జిల్లా పరిధిలోని పన్వేల్‌ వెళ్లినట్లుగా వివరాలు సేకరించారు. పన్వేల్‌లోని పర్వత ప్రాంతాల్లో వెతకగా కుళ్లిపోయిన స్థితిలో రచిత మృతదేహం కనిపించింది. ఈసారి ఒంటరిగా ఎక్కే ప్రయత్నంలో ఆమె ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెంది ఉంటుందని భావిస్తున్నారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోవడంతో అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. బుధవారం సాయంత్రం మృతదేహాన్ని హైదరాబాద్ తీసుకొచ్చారు.

Rachita Gupta Kanodia death

అయితే సాధారణంగా పర్వతారోహకులు బృందాలుగా ట్రెక్కింగ్‌ చేస్తారు. ఒంటరిగా వెళ్లినా గైడ్‌ను ఏర్పాటు చేసుకుంటారు. అయితే రచిత ఒంటరిగా వెళ్లటం వెనుక ఆంతర్యం ఏమిటనేది అంతు చిక్కడం లేదు. దీనిపై కుటుంబ సభ్యులు, భర్త కూడా నోరు మెదపకపోవటం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hyderabad mountaineer  Rachita Gupta Kanodia death  

Other Articles