నగ్న సెల్ఫీని పంపండి.. లోన్ పొందండి.. ఎక్కడా? | Chinese women are forced to send nude selfies to loan.

Naked selfies of women used as collateral for online loans

Naked selfies Loan, China Huge Naked Scam, Nude Selfies for Loan, Loan for Nude Photos, Nude Selfies as Guarantees, Loans on Naked Photos

Naked photos leaked online after hundreds of Chinese women are forced to send nude selfies to loan sharks as a ‘guarantee’ they’ll pay back the cash.

కలకలం రేపుతున్న నగ్న సెల్పీల దందా

Posted: 12/07/2016 02:51 PM IST
Naked selfies of women used as collateral for online loans

సాధారణంగా లోన్ కావాలంటే ఎవరైనా ఏం చేస్తాం? ఏ భూమో, నగలో తాకట్టుపెట్టి బ్యాంకుల దగ్గరి నుంచి దాన్ని పట్టేస్తాం. కానీ, చైనాలో మాత్రం ఇప్పుడు ఓ లోన్ స్కాం సంచలనం రేపుతోంది. లోన్ కావాలంటే మీ నగ్న సెల్ఫీలు పంపాలంటూ యువతులకు ఆహ్వానం పంపుతోంది ఓ ఆన్ లైన్ పోర్టల్.

సుమారు 10 గిగాబైట్ల డేటాతో 167 మంది యువతులకు చెందిన నగ్న ఫోటోలు, వీడియోలు ఆ పోర్టల్ లో దర్శనమివ్వటం చైనా వ్యాప్తంగా కలకలం రేపింది. రుణం కావాలంటే యువతులు ఫోటోలు, వీడియోలను పంపాలి. లోన్ తీసుకునే సమయంలో తమ వివరాలు తెలియపరచనప్పటికీ, లావాదేవీలు జరిపే సమయంలో మాత్రం వారు ఖచ్ఛితంగా వివరాలు వెల్లడించాల్సి ఉంటుందంట. ఇక లోన్ చెల్లించకపోతే ఆ ఫోటోలు యువతుల ఫ్యామిలీ మెంబర్స్ కి పంపిస్తారన్న కండిషన్ తోనే లోన్ ను కల్పిస్తున్నాయి సదరు వెబ్ పోర్టల్ తో కాంట్రాక్టు కుదుర్చుకున్న కార్పొరేట్ సంస్థ. కేవలం మూడు నిమిషాల్లోనే తనకు 5 వేల యువాన్లు దక్కాయని నగ్న ఫోటోలు పంపిన ఓ యువతి మీడియాకు వివరించింది.

యూజర్ల అవసరాలను బట్టి రుణం, వడ్డీ రేట్లు నిర్ణయిస్తారు. ఇలా న్యూడ్ లోన్స్‌పై ఆసక్తిపెరిగినవారు వారంలో 30శాతానికి పైగా పెరిగిపోయారని గ్లోబల్ టైమ్స్ పత్రిక తెలిపింది. కొన్ని లావాదేవీలకు ఖచ్చితంగా వారి సమాచారం కూడా తమకు అవసరమేనని పేర్కొంటున్నారు. తమకు లైంగిక సుఖాలను అందించేందుకు యువతులు ముందుకు వస్తే మాత్రం ఆ రుణాలను తామే చెల్లిస్తామంటూ కొందరు బిజినెస్ మాన్ లు బంఫరాఫర్ ఇస్తున్నారు.

ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని గతంలో ఇలాంటి స్కాంలు చైనాలో పెద్ద మొత్తంలోనే బయటపడ్డాయి. ఆ మధ్య ఇంతకు ముందు విద్యార్థినుల విషయంలో కూడా ఇలాంటి పెద్ద కుంభకోణమే బయటపడిన విషయం తెలిసిందే. అయినా అక్కడి చట్టాలు వాటిని అదుపు చేసే ప్రయత్నం మాత్రం చేయటం లేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chinese women  Naked selfies Loan  

Other Articles