తమిళనాడు ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం ప్రమాణం Panneerselvam takes oath as tamilnadu cm

Panneerselvam takes oath as tamilnadu cm

Jayalalithaa, O. Panneerselvam, Tamil Nadu, new Chief Minister, passed away, appolo hospitals, chennai, jayalalithaa death, jayalalithaa death news, jayalalithaa, jayalalithaa dead, jayalalithaa dies, jayalalithaa health, actress jayalalithaa, j jayalalithaa, j jayalalithaa films, j jayalalithaa roles, jayalalithaa news, jayalalithaa updates, tamil nadu chief minister, k karunanidhi, amma, amma death, aiadmk, aiadmk jayalalithaa, jayalalithaa news, tamil nadu news

Tamil Nadu Finance Minister O. Panneerselvam takes oath as New Chief Minister of Tamil Nadu in Raj Bhavan in the presence of Governor K Vidyasagar Rao

తమిళనాడు ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం ప్రమాణం

Posted: 12/06/2016 01:33 AM IST
Panneerselvam takes oath as tamilnadu cm

అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆకస్మిక మృతితో తమిళనాడు యావత్తు శోకసంధ్రంలో మునిగిపోయింది. అయితే రాష్ట్ర పరిపాలనా బాధ్యతలను ఎవరు చేపడతారన్న ఉత్కంఠకు తెరదించుతూ.. ఓ పన్నీరు సెల్వం తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. అర్థరాత్రి ఒంటిగంట సమయంలో అన్నాడీఎంకే శాసనసభ్యులు, అమాత్యులతో కలసి రాజ్ భవన్ కు వెళ్లిన పన్నీరు సెల్వం.. అక్కడ అమ్మ మృతికి సంతాపసూచకంగా రెండు నిమిషాలు మౌనం వహించారు.

అనంతరం జరిగిన కార్యక్రమంలో ఇన్‌చార్జి గవర్నర్‌ విద్యాసాగర్‌రావు.. సెల్వం చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి అసెంబ్లీ స్పీకర్‌ ధన్‌పాల్‌ సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఏఐడీఎంకే కీలక నేతలు హాజరయ్యారు. పన్నీర్‌ సెల్వంతో ప్రమాణస్వీకారం చేయించడానికి ముందు గవర్నర్‌ విద్యాసాగర్‌ రావు భావోద్వేగంగా మాట్లాడారు. జయలలిత మరణం తనను కలిచివేసిందని, ఆమె గొప్పనాయకురాలని గవర్నర​ అన్నారు. అనంతరం పన్నీరు సెల్వంతో పాటు ఇతర మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేశారు.

అస్పత్రిలో చేరిన తరువాత అపధర్మ ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వహిస్తున్న పన్నీరు సెల్వం.. ఆమ్మకు నమ్మినబంటుగా ఉంటూ గతంలోనూ రెండు పర్యాయాలు అపధర్మ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయనను పార్టీకి చెందిన ఎమ్మెల్యేలందరూ ఏకగ్రీవంగా ఎన్నుకోగా.. హుటాహుటిన ఆయన రాజ్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో సీఎంగా ప్రమాణం చేశారు. ఆ వెనువెంటనే అమ్మకు అధికారికంగా నివాళులు పలికేందుకు తన మంత్రిమండలితో పాటు అపోలో అసుపత్రికి వెళ్లారు. అమ్మ అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లను కూడా ఆయన పర్యవేక్షించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles