అనంతలోకాలకు తరలివెళిల్లిన అమ్మ.. Jayalalithaa, Tamil Nadu Chief Minister, passes away

Jayalalithaa tamil nadu chief minister passes away

jayalalithaa death, jayalalithaa death news, jayalalithaa, jayalalithaa dead, jayalalithaa dies, jayalalithaa health, actress jayalalithaa, j jayalalithaa, j jayalalithaa films, j jayalalithaa roles, jayalalithaa news, jayalalithaa updates, tamil nadu chief minister, k karunanidhi, amma, amma death, aiadmk, aiadmk jayalalithaa, jayalalithaa news, tamil nadu news

Tamil Nadu Chief Minister Jayalalithaa passed away at 11.30 p.m. on Monday at the Apollo Hospitals, Chennai. She was 68.

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కన్నుమూత

Posted: 12/06/2016 12:44 AM IST
Jayalalithaa tamil nadu chief minister passes away

అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి.. పురచ్చితలైవి జయలలిత (68) అనంతలోకాలకు పయనమయ్యారు. దక్షిణభారత రాజకీయాలలో ఉక్కుమహిళగా వెలుగోందిన జయలలిత.. ముఖ్యంగా తమిళనాట ప్రజానికంలో చెరగని ముద్ర వేసిన పురచ్చీతలైవి.. అమెను అభిమానించే కోట్లాది మంది అభిమానులను అనాధలుగా చేసి అనంతలోకాలకు వెళ్లిపోయారు. చలిజ్వరం, డీహైడ్రేషన్ కారణంగా సెప్టెంబర్ 22న అపోలో అస్పత్రిలో చేరిన అమ్మ.. 74 రోజుల పాటు చికిత్స పోందిన అనంతరం డిసెంబర్ 6 రాత్రి 11.30 నిమిషాలు పరపమదించినట్లు అపోలో అస్పత్రి వర్గాలు అధికారికంగా ప్రకటించాయి.

ఆస్పత్రిలో చేరిన జయలలిత అరోగ్యంపై అక్టోబర్ తొలివారం నుంచి ఇవాళ్లి వరకు ఆమె ఆరోగ్యం పలు రకాలుగా మారుతూ వచ్చింది. ఒక సమయంలో పూర్తి అచేతనంగా మారిందని, ఆ తరువాత అమె చికిత్సకు స్పందిస్తున్నారని, అన్నం తిన్నారని, కాలర్ మైకు సాయంతో కొద్దిసేపు మాట్లాడారని కూడా వార్తలు వచ్చాయి. ఇక అమె పూర్తిగా కోలుకున్నారని, ఐసీయూ నుంచి అమెను ప్రత్యేక వార్డుకు తరలించి.. ఇక ఆమె ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఇంటికి పంపేస్తామని అస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

ఈ తరుణంలో అకస్మికంగా ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో ఆమె కార్డియాక్ అరెస్టుకు గురికావడంతో ఒక్కసారిగా అన్నివర్గాల్లో మళ్లీ తీవ్ర ఆందోళన నెలకొంది. అమెను హుటాహుటిన మళ్లీ ఐసీయూకి తరలించి చికిత్స అందించారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం కూడా జయలలితకు గుండె ఆపరేషన్ చేసి అమెకు ఎమ్కో ద్వారా చికిత్సనందించినా అమె అందుకు స్పందించలేదు. దీంతో అపోలో ఈడీ సంగీతరెడ్డి మధ్యాహ్నం 2.40 గంటలకు తాము అమెకు చికిత్స కోసం అన్నివిధాలా శ్రమిస్తున్నామని, అయితే అమె పరిస్థితి మాత్రం విషమయంగానే వుందని ట్విట్ చేయడంతో అమ్మ అభిమానులు షాక్ కు గురయ్యారు.

పార్టీ కార్యకర్తలు, అభిమానులను, నాయకులను, శ్రేయోభిలాషులను శోకసంద్రంలో ముంచుతూ మరలిరాని లోకాలకు తరలిపోయారని అపోలో వద్ద పరిస్థితులను బట్టి తమిళ ప్రజలు అంచనా వేశారు. ఈ క్రమంలో రాత్రి 12.15 నిమిషాలకు అమ్మ పరమపదించారని అన్నాడీఎంకే పార్టీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా ప్రకటించగా, అటు అపోలో అస్పత్రి వర్గాలు కూడా తమిళనాడు పురచ్చితలైవి ఇకలేరని అధికారికంగా ప్రకటించారు. ‘అమ్మ బాగానే ఉన్నారు.. ‘ఇక ఇంటికి వచ్చేస్తారు..’ అంటూ అస్పత్రి వర్గాల ప్రకటన చేసిన గంటల వ్యవధిలోనే అవిరవ్విందని అభిమానులు శోకసంద్రంలో మునిగారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jayalalithaa  chief minister  tamilnadu  passed away  appolo hospitals  chennai  

Other Articles