అమ్మ బతకాలంటే మరో అద్భుతం జరగాల్సిందే.. | Subramanian Swamy on jayalalitha's Cardiac arrest.

Subramanian swamy response on jayalalitha s cardiac arrest

Jayalalitha Cardiac arrest, BJP MP subramanian Swamy, subramanian Swamy Jayalalithaa, Jayalalithaa subramanian Swamy, subramanian Swamy Jayalalithaa, BJP Jayalalitha, JP Nadda on Jayalalithaa

BJP MP subramanian Swamy hopes for 'miracle' and recover Jayalalithaa from Cardiac arrest.

జయ ఆరోగ్యంపై ఆయన వెరైటీగా స్పందించారు

Posted: 12/05/2016 12:30 PM IST
Subramanian swamy response on jayalalitha s cardiac arrest

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం కృత్రిమ శ్వాసతో ఎయిమ్స్ వైద్యులు చికిత్స అందిస్తున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా ఓ ప్రకటన చేశారు. జయలలితకు ప్రాణాపాయం తప్పిందని, అయితే ఐసీయూ సేవలు అవసరమని ఆయన ప్రకటించారు. ఓ భద్రతను పటిష్ట పరుస్తూ ఏదో జరగబోతుందన్న సంకేతాలు అందిస్తూనే, మరోవైపు ఆపద ఏం లేదంటూ వ్యాఖ్యలు చేయటం విశేషం.

‘జయలలిత ఆరోగ్య పరిస్థితిపై చెన్నైలోని అపోలో ఆస్పత్రి వర్గాలతో, తమిళనాడు ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నాం. ఢిల్లీ ఎయిమ్స్‌ నుంచి వైద్యుల బృందాన్ని చెన్నైకు పంపాం. జయలలిత ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్నాం. ఆదివారం ఆమెకు గుండె సంబంధిత సమస్య ఏర్పడటంతో ఐసీయూకు తరలించారు. ప్రస్తుతం ఆమెకు ప్రాణాపాయం తప్పింది అని మీడియాతో పేర్కొన్నాడు.

అయితే ఐసీయూ సేవలు అవసరం. జయలలిత చికిత్స కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తాం. ఎయిమ్స్ వైద్యులు చెన్నైకు వెళ్లిన తర్వాత ఆమె ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తారు. ఆ తర్వాత తదుపరి చర్యలు ఏం తీసుకోవాలన్నది నిర్ణయిస్తాం’ అని జేపీ నడ్డా వివరించాడు.

స్వామి స్పందన...

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఎంతో గుండె నిబ్బరమున్న మహిళని అని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి కొనియాడాడు. మరో అద్భుతం జరిగి ఆమె తిరిగి ప్రజల ముందుకు రావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.

ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన "జయలలితకు గుండెపోటు వచ్చిందని విని కలత చెందాను. ఆమె మానసికంగా దృఢమైన వ్యక్తి. మరో అద్భుతం జరిగిందని, ఆమె కోలుకుందని ఈ మధ్యాహ్నం 12 గంటలకు డాక్టర్లు చెబుతారని ఆశిస్తున్నాను. ఆ అద్భుతం జరిగిందో... జరగలేదో మరి కాసేపట్లో తెలుస్తుంది" అని అన్నారు. ఆమె కోలుకోవాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు తెలిపారు. కాగా, అక్రమాస్తుల కేసులో జయలలితను కోర్టుకు లాగింది ఈయనే అని తెలిసిందే.

ప్రత్యేక పూజలు...

ఇక జయలలిత ఆరోగ్యం మరింత విషమించినట్టు తెలుస్తోంది. ఆమె చికిత్స పొందుతున్న అపోలో ఆసుపత్రి వద్దకు చాలా సైలెంట్ గా పోలీసు వాహనాలు చేరుకుంటున్న నేపథ్యంలో, లోపలి పరిస్థితి అనుమానాస్పదంగానే ఉన్నట్టు... ఆసుపత్రి వద్ద వేచి ఉన్న కార్యకర్తలు, అభిమానులు భావిస్తున్నారు. మరోవైపు, వందలాది మంది అపోలో ఆసుపత్రికి తరలివస్తున్నారు. జయలలిత కార్డియాక్ అరెస్ట్ కు గురయ్యారంటూ అపోలో వైద్యులు స్పష్టం చేయడంతో... ఒక్కసారిగా అందరూ షాక్ కు గురయ్యారు. తమ అమ్మ పురచ్చితలైవి ఆరోగ్య పరిస్థితి తెలియక... ఓవైపు, ఏఐఏడీఎంకే మహిళా కార్యకర్తలు కంటతడి పెడుతున్నారు. మరోవైపు, అమ్మను కాపాడాలంటూ రోడ్లమీదే ప్రార్థనలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BJP MP subramanian Swamy  Tamil Nadu CM Jayalalithaa  Cardiac Arrest  

Other Articles