నోట్ల ర‌ద్దుతో మీడియాకూ చుక్క‌లు.. దేనికి? | no ads to media on demonetization effect.

Demonetization effect on media ads

Indian Advertisement, advertising industry India, demonetization effect on Media, No ads to Media, demonetization Ads, Paper ads demonetization

The advertising industry is staring at a business loss of around Rs 2,000 crore in the year's best quarter as demonetization takes a toll on consumer demand in India.

2000 కోట్లు లాస్ తో చుక్కలు చూస్తున్నారంట!

Posted: 12/03/2016 08:18 AM IST
Demonetization effect on media ads

నోట్ల ర‌ద్దు ప్రభావం చిన్న పెద్దా వర్గాల తేడా లేకుండా అంతా ఎదుర్కోవాల్సి వస్తుంది. సెలబ్రిటీలు కూడా తమ వ్యధలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంటూ ఊస్సురు మంటుంటే, కొందరు నేతలు మాత్రం దర్జాగా నోట్లను మార్చేసుంటూ అడ్డంగా మీడియాకు దొరికిపోతున్నారు. మొన్న రెండు ఘటనల్లో ఓ చోట 4 కోట్లు, మరో చోట 80 లక్షలు దొరికిన విషయం తెలిసిందే. తాజాగా ఓ బీజేపీ నేత 40 లక్షల కొత్త నోట్లతో దొరికిపోయాడు. ఇదిలా ఉంటే ఈ ఇబ్బందుల ప‌డుతున్న వారి జాబితాలోకి ఇప్పుడు మీడియా కూడా చేరింది.

పైసలు లేక, ప్రకనటలు కార మీడియా రంగం క‌కావిక‌లు అవుతోంది. కేవ‌లం ప్ర‌క‌ట‌న‌ల‌పైనే ఆధార‌ప‌డే ఉన్న కొన్ని దిన‌ప‌త్రిక‌లు, టీవీ చాన‌ళ్లు, రేడియోలకు అయితే చుక్కలు కనిపిస్తున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ రంగం రూ.2000 వ‌ర‌కు న‌ష్టాన్ని మూట‌గ‌ట్టుకున్నట్టు అంచ‌నా. నోట్ల ర‌ద్దుతో ఖ‌ర్చును విప‌రీతంగా త‌గ్గించుకుంటున్న కార్పొరేట్ సంస్థ‌లు మొత్తంగా ప్ర‌క‌ట‌న‌లు ఇవ్వ‌డం ఆపేసిన‌ట్టు ఓ జాతీయ బిజినెస్ పత్రిక తన క‌థ‌నంలో పేర్కొంది.

నోట్ల ర‌ద్దు ప్ర‌భావం తాత్కాలిక‌మేన‌ని, త్వ‌ర‌లోనే అంతా స‌ర్దుకుంటుంద‌ని భావించామ‌ని, అయితే త‌మ అంచనా త‌ప్ప‌యింద‌ని అందులో తెలిపింది. చాలా కంపెనీలు త‌మ ప్ర‌క‌ట‌నల వ్య‌వ‌యాన్ని పూర్తిగా త‌గ్గించేసుకున్నాయ‌ని, డిసెంబ‌రులో ఇది మ‌రింత తీవ్ర‌రూపం దాల్చే అవ‌కాశం ఉంద‌ని మ‌రో సంస్థ‌కు చెందిన చీఫ్ ఎగ్జిక్యూటివ్ తెలిపారు. ప్ర‌క‌ట‌న‌ల రంగానికి త‌క్కువ‌లో త‌క్కువ‌గా రూ.1500 కోట్ల న‌ష్టం వాటిల్లి ఉంటుంద‌ని అంచనా వేస్తున్న‌ట్టు డెంట్స్ ఏజిస్ నెట్‌వ‌ర్క్ ద‌క్షిణాసియా సీఈవో ఆశిష్ భాసిన్ తెలిపారు.

ఈ ఏడాది రూ.50 వేల కోట్ల ప్ర‌క‌ట‌న‌లు వ‌స్తాయ‌ని అంచ‌నా వేశామ‌ని, కానీ త‌మ అంచ‌నాలు త‌ల్ల‌కిందులు అవుతున్నాయ‌ని కంపెనీలు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నాయి. ఈ న‌ష్టాల నుంచి గ‌ట్టెక్కేందుకు ఎంత లేదన్నా మూడు నాలుగు నెల‌ల స‌మ‌యం ప‌డుతుంద‌ని ఐజీపీ మీడియా బ్రాండ్స్ సీఈవో శ‌శిసిన్హా పేర్కొన్నారు. ఇంకోవైపు టీవీల్లో యాడ్ ఇచ్చేందేందుకు కొన్ని సంస్థలు వెనుకంజ వేస్తుండటం, రోడ్ల మీద ప్రచారం కోసం ఫ్లెక్సీలు, బ్యానర్లు, పెద్ద పెద్ద హోర్డింగ్ లు ఏర్పాటు చేసే ప్రకటనలపై కూడా దీని ప్రభావం ఎక్కువగానే కనిపిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : demonetization  Media  Advertisement  No ads  

Other Articles