థియేటర్లలో జనగణమన.. జెండా... ఇదేనా గౌరవం? | National Anthem must be played in movie theatres.

Jana gana mana must in cinemas before screening

National anthem, National anthem theatres, National anthem theatres, theatres Jana gana mana, Jana gana mana cinema halls, Jana gana mana supreme court, Jana gana mana flag theatres, Jana gana mana Flag movies, Theaters respect anthem flag

National anthem mandatory in theatres across India: Supreme Court.

థియేటర్లలో జనగణమన.. నిలబడకపోతే ఏం చేస్తారు?

Posted: 11/30/2016 03:20 PM IST
Jana gana mana must in cinemas before screening

జనగణమనపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇక నుంచి సినిమా ప్రారంభానికి ముందు అన్ని థియేటర్లలో జాతీయ గీతం వినిపించాలని ఆదేశించింది. బుధవారం అత్యున్నత న్యాయస్థానం ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది. గీతం వినిపిస్తున్నంత సేపు లేచి ఖచ్ఛితంగా నిలబడాల్సిందేనన్న కోర్టు, ఆ సమయంలో స్క్రీన్లపై జాతీయ పతాకాన్ని చూపించాలని కూడా సూచించింది.

‘‘దేశభక్తి, జాతీయతా భావాలు ప్రతి పౌరుడిలో నిండి ఉండాలంటే జాతీయగీతాన్ని ఆల‌పించాల్సిన అవసరం ఎంత‌యినా ఉంది. దేశం ప‌ట్ల ఆరాధనా భావం, పూజనీయమైన భావం పెరిగేలా దీనిని ఖచ్చితంగా పాటించాలంటూ తెలిపింది. జాతీయగీతం, జాతీయ జెండాను ప్ర‌తి ఒక్క‌రు గౌర‌వించాలని స్ప‌ష్టం చేసింది. దీంతో, ఇక‌పై విశ్వ‌క‌వి రవీంద్ర‌నాథ్ ఠాగూర్ రాసిన‌ జనగణమన అధినాయక జయ హే భారత భాగ్యవిధాతా! గీతం ప్ర‌తి థియేట‌ర్ల‌లోనూ విన‌ప‌డ‌నుంది.

సుప్రీం తీసుకున్న ఈ నిర్ణయంపై బీజేపీ ఎంపీ, నటుడు పరేష్ రావల్ తనదైన శైలిలో స్పందించాడు. ‘థియేటర్లలో జాతీయగీతాన్ని ప్రదర్శించాల్సిందే. జాతీయ జెండా చూపించాల్సిందే. మనది కాకుంటే సోమాలియా జాతీయగీతాన్ని వినిపించాలా?’ అని ఆయన ప్రశ్నించారు.

కాగా, ఈ నిర్ణయాన్ని సమర్థిస్తున్నవారు కొందరైతే, దేశభక్తి ప్రదర్శించుకోవడానికి థియేటర్ల వేదిక కావాలా? అంటూ మరికొందరు పెదవి విరుస్తున్నారు. జాతీయ గీతం ఆలాపించే సమయంలో ఒకవేళ ఎవరైనా నిలుచోకపోతే అది ఖచ్ఛితంగా అవమానించినట్లే అవుతుంది కదా. అలాంటప్పుడు ఇలాంటి ఆదేశాలు ఇవ్వటం సరైందికాదన్నది వారి అభిప్రాయం. గతంలో ముంబై లో ఓసారి ఓ ఆఫ్రికన్ యువతి ఇలా జాతీయ గీతం వచ్చిన సమయంలో నిలుచోలేదు. అడిగితే తాను అసలు ఇండియనే కాదని, అయినా తాను నేషనలిజంకు వ్యతిరేకినని ప్రకటించింది. మరో ఉదంతంలో చెన్నైకి చెందిన ఓ లాయర్ జనగణమన సమయంలో చాలా మంది నిలుచోవటం లేదని, తద్వారా జాతీయ గీతానికి అవమానం జరుగుతుందని పిటిషన్ వేయగా, కోర్టు దానిని కొట్టేసింది. ప్రజల్లో ఇప్పటికే సమైకత్య ఉన్నప్పడు దేశ భక్తిని ఇలా ప్రదర్శించుకోవాల్సిన అవసరం ఏముంటందన్నది వారి వాదన.

ఏది ఏమైనా సినిమాలే లోకంగా బ‌తుకుతున్న చాలా మందికి ఈ ఆదేశాలతో జాతీయతా భావం ఖచ్చితంగా పెరుగుతుందని కొందరు గట్టిగా నమ్ముతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jana gana mana  theaters  flag  

Other Articles