పేటీఎం హ్యాక్ ఫేక్ న్యూసేనా? | warning bells from Paytm for password change.

Passwords change alert for paytm

Paytm Hack, Paytm head quarters, paytm customers, Paytm data hack, Paytm demonetization, paytm passwords

Is Paytm Hacked ? Once Check Your Paytm wallet and Saved Cards??.

మీ పేటీఎం అకౌంట్ ను చెక్ చేసుకోండి!

Posted: 11/30/2016 07:38 AM IST
Passwords change alert for paytm

ఆన్ లైన్ చెల్లింపుల సైట్ పేటీఎం హ్యాకింగ్ కు గురైందన్న వార్త ఒక్కసారిగా కలకలం రేపుతోంది. నోయిడాలోని పేటీఎం హెడ్ క్వార్టర్స్ నుంచి ఈ హెచ్చరికలు జారీ అయినట్లు తెలుస్తోంది. కోట్లాది మంది అకౌంట్లను హ్యాక్ చేసిన హ్యాకర్లు అందులోని నగదును తమ ఖాతాల్లోకి మళ్లీంచే ప్రయత్నంలో ఉన్నారని, ఈ మేరకు యూజర్లు తమ పాస్ వర్డ్ లను మార్చుకోవాలంటూ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

కేంద్రం తీసుకున్న పెద్దనోట్ల రద్దుతో ఒక్కసారిగా ఆన్ లైన్ పేమెంట్ లకు వినియోగదారులు ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఆన్ లైన్ చెల్లింపు సేవలను సులభం చేసే పేటీఎం లో యూజర్లు గా చేరినవారు కోట్ల రూపాయలను ఖాతాల్లో జమచేశారు. దీంతో కన్నేసిన హ్యాకర్లు పంజా విసిరారు. ఏకంగా 2.5 లక్షల మంది ఖాతాదారుల డేటాను చౌర్యం అయి ఉండొచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి. పేటీఎం యూజర్ల ఈమెయిల్, ఫోన్ నెంబర్లు హ్యాకర్ల చేతికి చిక్కినట్టు తెలుస్తోంది. 

ఈ వార్తలతో పేటీఎం యూజర్లు ఆందోళన చెందుతున్నారు. దీనిపై అధికారిక ప్రకటన కావాలని కోరుతున్నారు. 2010 లో ప్రారంభమైన పేటీఎం సేవలు మొబైల్ రీఛార్జీలతోపాటు, ఈ కామర్స్ వెబ్ సైట్ లైన అమెజాన్, ప్లిఫ్ కార్ట్, స్నాప్ డీల్ లాంటి వాటి చెల్లింపులతో క్యాష్ బ్యాక్ సేవలు అందిస్తోంది.  కాగా, ప్రస్తుతం కరెన్సీ లోటు పరిస్థితుల నేపథ్యంలో ఆన్ లైన్ సంస్థలు లాభాల పంట పండించుకున్నాయి. వ్యాపారం ఒక్కసారిగా పుంజుకుంది. ఊహించనంతమంది యూజర్లు పేటీఎం  ఖాతాదారులైపోయారు.

అదంతా పుకారే...

కాగా, పేటీఎం అకౌంట్లు హ్యాక్ అయ్యాయని వస్తున్నవన్నీ వందతులేనని పేటీఎం డీజీఎం సోనియా ధావన్ ఓ ప్రకటనలో తెలిపారు. ఖాతాదారుల డేటా వంద శాతం సురక్షితంగా ఉందని, మీడియా కథనాలు సరిచేసుకోవాలంటూ అందులో పేర్కొన్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Paytm  Hack  passwords change alert  

Other Articles