అవినీతిపై పోరులో మెతకబడిన మోదీ సర్కార్.. New black money disclosure scheme post demonetisation

Black money holders get another chance to come clean

Income Tax Act, Amendments, Demonetisation, cash deposits, Note Ban News, Narendra Modi, Black Money, Jan Dhan Accounts, Benami Transactions, Banks, Currency ban, Notes Ban, Arun jaitley, digital transactions, Cashless Society, parliament session, congress, rbi rules, pm modi india news

This legislation has an income disclosure scheme, under which black money holders can deposit the banned high-value currency notes in their accounts and declare them to the government.

అవినీతిపై పోరులో మెతకబడిన మోదీ సర్కార్..

Posted: 11/29/2016 08:14 PM IST
Black money holders get another chance to come clean

పెద్ద నోట్ల రద్దుతో దేశంలోని అవినీతి, నల్లధనంపై యుద్దం సాగించడంలో ఎటువంటి పరిస్థితులలో వెనుకంజ వేసేది లేదని తేల్చిచెప్పిన నరేంద్రమోడీ ప్రభుత్వం మెతకబడింది. గత 20 రోజులుగా దేశంలోని సామాన్య ప్రజలు డబ్బుల కోసం అనేక అవస్థలు పడుతున్నా పట్టని కేంద్రం.. నల్లధన కుబేరులకు మాత్రం మరో ఆఫర్ ను అందించింది. ఇప్పటికే దేశంలో పది శాతం లోపు వున్న నల్లకుభేరులు కోసం 90 శాతం దేశప్రజలను అవస్థల పాలు చేస్తారా..? అన్న విమర్శలు తెరపైకి వస్తున్నా.. తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి వెనకడుగు వేయదని పలుమార్లు స్పష్టం చేసిన ప్రధాని.. ప్రజలకు కొన్నాళ్లు అవస్థలు తప్పవని సూచిస్తూనే.. నల్ల కుభేరులకు మాత్రం మరో ఆఫర్ ను ప్రవేశపెట్టారు.

గత 20 రోజులుగా దేశవ్యాప్తంగా ఎక్కడా నల్లధన కుబేరులు చెప్పుకోదగ్గ స్థాయిలో డబ్బును మారుస్తునే, బినామీ అకౌంట్లలో జమచేస్తునో పట్టుబడకపోవడంతో.. దిగివచ్చిన కేంద్ర ప్రభుత్వం.. నల్లకుబేరులకు క్షమాభిక్ష ప్రసాదించింది. ‘ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన’ స్కీమ్ కింద నల్లడబ్బును వెల్లడిస్తే పన్ను, సర్‌చార్జి కలుపుకొని 50 శాతం జరిమానా విధిస్తారు. 25 శాతం సొమ్మును నాలుగేళ్లపాటు వడ్డీరహితంగా ప్రభుత్వం వద్ద భద్రపరుచుకొని ఆ తర్వాత తిరిగి చెల్లిస్తారు. అంటే నల్లధనం సగం సగం పంచుకుంటున్నారు.

ఈ స్కీమ్ కింద కాకుండా ఎవరివద్దనైతే నల్లడబ్బు దొరకుతుంతో వారికి 75 శాతం జరిమానా విధిస్తారని, అవసరమైతే మరో పది శాతం సర్‌చార్జి విధించే అవకాశం ఉంటుందన్నది  చట్టంలోని మరో అంశం. ఎలాంటి జైలు శిక్షలు అనుభవించాల్సిన అవసరంలేకుండా కేవలం జరిమానాలతోనే సరిపెడుతూ నల్ల కుబేరులకు సర్కారు ఇస్తున్న సరికొత్త ఆఫర్ ఇది. నల్లకుబేరులను కఠినంగా శిక్షిస్తామని, ఆదాయం పన్ను ఎగవేయడం మానవత్వానికి వ్యతిరేకంగా జరగుతున్న నేరంగా పరిగణిస్తున్నామని చెప్పుతూ వస్తున్న కేంద్రం.. వారిపై పదే పదే ప్రేమను కబర్చడంతో మోదీ ప్రభుత్వంపై కూడా విమర్శలు వస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles