రూ.2 వేల నోటు రద్దు.. ఫ్యూచర్ లో టాక్స్ ఉండదా? | CM KCR Answers To Media Personnel Questions Over Demonetization.

Kcr press meet about demonetization

Telangana, CM KCR, Telangana cabinet meeting, Telangana CM KCR, CM KCR Demonetization, KCR Demonetization Modi, KCR new notes, Telangana Demonetization

Telangana CM KCR press meet after cabinet meeting over Demonetization.

2000 నోటు రద్దు చేసే ఛాన్స్?

Posted: 11/29/2016 07:41 AM IST
Kcr press meet about demonetization

భవిష్యత్తులో ఇప్పుడు కొత్తగా వచ్చిన రూ.2 వేల నోటు ఉంటుందో లేదో చెప్పలేమని తెలంగాణ సీఎం కే.చంద్రశేఖర్ రావు వ్యాఖ్యానించారు. రెండు వేల నోటును వాడుకలోకి తీసుకురావటంతో నల్లధనం మరింత పెరుగుతుంది కదా అని అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు. భవిష్యత్తులో దాన్ని కూడా రద్దు చేయవచ్చు. కేంద్రం వ్యూహంలో ఇదో భాగం కావచ్చు...’’ అని ఆయన తెలిపారు. పెద్ద నోట్ల రద్దుతో ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక స్థితిగతులపై మూడు గంటలపాటు కేబినెట్ మీటింగ్ జరగ్గా, అనంతరం ఆయన మీడియాతో మాట్లాడాడు.

ఇక మరో ప్రశ్నకు సమాధానంగా ‘‘భవిష్యత్తులో ఆదాయపు పన్ను ఉండకపోవచ్చు. ప్రస్తుతం దేశంలో ఒక శాతం మందే ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారు. వారిలో ఉద్యోగులే ఎక్కువ. దానికి బదులు భవిష్యత్తులో జీఎస్‌టీ, బీటీటీ రెండే పన్నులు అమలు చేసే వీలుంది. బ్యాంకు ట్రాన్సాక్షన్ టాక్స్(బీటీటీ) పన్ను ఒకటే అమలు చేసే అవకాశముంది. దీంతో కేంద్రానికి వచ్చే ఆదాయం ఇప్పుడొచ్చే ఆదాయం కంటే అరుుదారు రెట్లు అధికంగా వచ్చే అంచనాలున్నాయి. అప్పుడు రాష్ట్రాలకు వచ్చే ఆదాయం కూడా పెరిగిపోతుందని పేర్కొన్నాడు.

ప్రస్తుతం కేంద్రం పన్నుల వాటాలో 42 శాతం రాష్ట్రాలకు పంపిణీ అవుతోంది. ప్రతి ఏటా రూ.13 వేల కోట్లు.. నెలనెలా దాదాపు రూ.997 కోట్ల ఆదాయం వస్తుంది. అప్పుడు ఇది అరుుదారు రెట్లు పెరిగే వకాశాలున్నాయి. అందుకే ఈ నిర్ణయంతో భవిష్యత్తు ప్రయోజనాలుంటాయనిపిస్తోంది. ప్రస్తుతానికి నోట్ల రద్దుతో రాష్ట్రంలో అన్ని లావాదేవీలు తగ్గిపోయారుు. అందుకే ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తగ్గింది. రిజిస్ట్రేషన్లు, వ్యాట్‌పై ప్రభావం పడింది. ఆదాయం ఎంత మేరకు తగ్గుతుందనేది ఇప్పటికిప్పుడు చెప్పలేం. వచ్చే నెలలో అంచనా వేసుకునే వీలుంటుంది. తెలంగాణలో మొత్తం రూ.75 వేల కోట్ల మారక ద్రవ్యం చెలామణిలో ఉంది. అందులో 86 శాతం 500, 1000 నోట్లు ఉన్నట్లు అంచనా. ఇవన్నీ రద్దు చేయటంతో లావాదేవీలు స్తంభించి రాష్ట్ర ఆదాయంపై ప్రభావం పడటం ఖాయం. ఇప్పటివరకు రాష్ట్రంలో బ్యాంకు ఖాతాల్లో రూ.32 వేల కోట్లు జమయ్యారుు. రిజర్వు బ్యాంకు నుంచి రూ.12 వేల కోట్లు పంపిణీ అయ్యారుు. ప్రధానంగా చిన్న నోట్ల సమస్య నెలకొది. రూ.2 వేల నోటు ఉండీ లేని చందమైంది. నుమారుుష్‌గా మారింది. దాన్ని చిల్లరగా మార్చుకునేందుకు ఇబ్బందులున్నారుు. అందుకే చిన్న విలువైన నోట్లను సరఫరా చేయాలని ప్రధానికి విజ్ఞప్తి చేశాను’’ అని వివరించారు.

టీఎస్ వాలెట్ సేవలు...
ఇది క్లిష్ట సమయమనిఇలాంటి సమయంలో మీడియా సహకరించి, బాగా పని చేయాలని అన్నారు. ప్రజలను భయబ్రాంతులకు చేయకుండా కథనాలు ప్రచురించాలని సూచించారు. మీడియా, ప్రభుత్వం కలిసి పని చేయాలని ఆయన సూచించారు. నగదు రహిత లావాదేవీలు ప్రోత్సహించాలని, వీలైనంత త్వరగా ప్రారంభించాలని తెలిపారు. మూడు నాలుగు రోజుల్లో టీఎస్ వ్యాలెట్ సేవలు అందుబాటులోకి వస్తాయని ఆయన చెప్పారు. ఆధార్ కార్డ్ డేటాను రాష్ట్రాలకు అందుబాటులో ఉంచాలని కేంద్రానికి చెప్పామని ఆయన తెలిపారు.

బ్యాంకు ఖాతాలు లేని వారికి అకౌంట్లు ఓపెన్ చేయాలని అన్నారు. దీనికి ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. సిద్ధిపేట జిల్లాలోని సిద్ధిపేట నియోజకవర్గాన్ని ప్రయోగాత్మకంగా మోడల్ గా తీసుకుని 100 శాతం క్యాష్ లెస్ నియోజకవర్గంగా చేయాలని నిర్ణయించామని ఆయన చెప్పారు. బ్యాంకులు కూడా సహకరిస్తామని చెప్పాయని ఆయన తెలిపారు. ఇందులో మొదట్లో 500 రూపాయలు మాత్రమే వినియోగించుకునేలా చర్యలు చేపడతామని, ఆ తరువాత నెమ్మదిగా అవి కూడా లేకుండా ఉండేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఎవరూ నల్లధనం వెనుకేసుకోలేని భారతదేశాన్ని నిర్మించడంలో తెలంగాణ మద్దతు ఉంటుందని ఆయన చెప్పారు.

జీతాలపై డిసైడ్ కాలేదు...
తెలంగాణ ఉద్యోగులు జీతాల్లో కొంత భాగం నగదు కావాలని అడుగుతున్నారని, దానికి బ్యాంకర్లతో చర్చలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. సగం జీతమే చెల్లింపులు జరుగుతాయా? అన్న ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చాడు. ప్రభుత్వోద్యోగుల జీతాలపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని అన్నారు. అలాగే ఆసరా పెన్షన్లు ఇంతవరకు ఎలా ఇస్తున్నామో ఇకపై కూడా అదే విధానం అమలు జరుగుతుందని ఆయన చెప్పారు. ఈ స్కీము గురించి తెలిస్తే... తనపై ఆరోపణలు చేసే సన్నాసులు అలా చేయరని కేసీఆర్ మండిపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Demonetization  Telangana  CM KCR  pressmeet  

Other Articles