అసలు భారత్ బంద్ ఉందా? లేదా? | No bharat bandh only protest against narendra modi govt.

Aakrosh diwas mixed response by parties

Demonetisation, Bharat Bandh, Aakrosh Diwas, Left Parties Aakrosh Diwas, JDU Aakrosh Diwas, Congress Aakrosh Diwas, TMC Aakrosh Diwas

Demonetisation Bharat Bandh Aakrosh Diwas mixed response by parties.

ఆక్రోశ్ దివస్ అంతంత మాత్రమే...

Posted: 11/28/2016 07:48 AM IST
Aakrosh diwas mixed response by parties

పెద్ద నోట్లు ర‌ద్దు చేస్తూ వాటి స్థానే కొత్త నోట్ల ముద్రణ నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తూ సోమవారం వామ‌ప‌క్షాలు చేప‌ట్టిన దేశ‌వ్యాప్త బంద్ ప్రారంభ‌మైంది. దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఇప్ప‌టికే విప‌క్ష పార్టీల నేత‌లు, కార్య‌క‌ర్త‌లు రోడ్ల‌పైకి వ‌చ్చి బంద్‌లో పాల్గొంటున్నారు. రోడ్ల‌పై చేరి రవాణా వ్యవస్థను అడ్డుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఆందోళ‌న‌కారుల‌ను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లిస్తున్నారు. మ‌రోవైపు బంద్‌లో పాల్గొనేది లేద‌ని ముందే చెప్పిన కాంగ్రెస్ ఆక్రోశ్ దివస్ ను పాటించటం విశేషం. కేవలం నిరసనలు తెలిపేందుకే తాము మద్ధతు ఇస్తామని జేడీయూ, టీఎంసీ, కాంగ్రెస్ లు వామపక్షాలకు తేల్చి చెప్పేశాయి. అయితే బంద్ యథాతథంగా చేపడతామని, అత్యవసర సేవలను, బ్యాంకులను హర్తాళ్ నుంచి మినహాయించినట్టు వామపక్ష సంఘటన తెలిపింది.

అయితే మిగతా పార్టీలన్నీ చివరి నిమిషంలో మద్ధతు ఉపసంహరించుకోవటం, కేవలం లెప్ట్ పార్టీలే బంద్ లో పాల్గొనటంతో ప్ర‌జ‌లు పెద్ద‌గా ప‌ట్టించుకున్న‌ట్టు లేదు. కార్మిక సంఘాలు కూడా ఈ బంద్ లో పాల్గొనమని తేల్చి చెప్పటమేకాదు, ఇప్పటికే విధుల్లోకి దిగిపోయాయి కూడా. తెలుగు రాష్ట్రాల్లో బంద్ ప్ర‌భావం కాస్త‌యినా క‌నిపించ‌డం లేదు. హైదరాబాద్ లో సిటీ బస్సులతోపాటు,. ఎంజీబీఎస్ నుంచి ప‌లు ప్రాంతాలకు వెళ్లాల్సిన బ‌స్సులు అన్నీ య‌థావిధిగా నడుస్తున్నాయి. తెలంగాణ‌లోని మిగ‌తా జిల్లాల్లోనూ ఇదే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఇక ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని విజ‌య‌వాడ‌లో అయితే బంద్ ప్ర‌భావం కొంచెం కూడా క‌నిపించ‌డం లేదు. బ‌స్‌డిపో నుంచి ఇప్ప‌టికే 70 శాతం స‌ర్వీసులు ప్రారంభమై రోడెక్కాయి

మరోపక్క బంద్ సంద‌ర్భంగా ఎటువంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా పోలీసులు గ‌ట్టి బందోబ‌స్తు చ‌ర్య‌లు చేప‌ట్టారు. నోట్ల ర‌ద్దుతో ఇప్ప‌టికే ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్నార‌ని, బంద్ అని చెప్పి వారిని ఇబ్బంది పెట్టే కార్య‌క్ర‌మాలు చేస్తే చూస్తూ ఊరుకోబోమ‌ని పోలీసులు హెచ్చ‌రిస్తున్నారు. మ‌రోవైపు ఈ ఉద‌యం 9 గంట‌ల నుంచి త‌మ అసలు కార్యాచ‌ర‌ణ ప్రారంభిస్తామ‌ని వామ‌ప‌క్ష పార్టీలు చెబుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Demonetisation  Bharat Bandh  Aakrosh Diwas  Left Parties  

Other Articles