RBI Governor Urjit Patel breaks his silence on demonetisation

Urjit patel says rbi taking necessary action urges people to use debit cards

urjit patel, rbi, demonetisation, rbi governor, indian citizens, liquidity, bank, ATM centres, demonetisation news, rbi governor, genuine pain of citizens, liquidity, urjit patel demonetisation

The RBI governor, who came under attack by the opposition for his silence over the raging issue, emphasised that liquidity in the banking system has increased.

మౌనముద్ర వీడిన అర్భీఐ గవర్నర్.. రూ.500 నోట్లపై క్లారిటీ

Posted: 11/27/2016 07:37 PM IST
Urjit patel says rbi taking necessary action urges people to use debit cards

పెద్ద నోట్ల రద్దుపై ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ఎట్టకేలకు మౌనముద్ర వీడారు. బ్యాంకుల్లో, ఏటీయంలలో నగదు లభ్యత రోజురోజుకు పెరుగుతోందని, పరిస్థితులు యథాపూర్వ పరిస్థితికి తీసుకు వచ్చేందుకు ఆర్బీఐ పూర్తి దృష్టి సారించిదని చెప్పారు. నిజాయితీపరుల సమస్యల పరిష్కారానికి, వారికి తలెత్తుతున్న ఇబ్బందులను తొలగించేందుకు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. జనం ఎదుర్కొంటున్న వాస్తవ ఇబ్బందులపై రోజువారీ సమీక్ష జరుపుతూ వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

నగదు సమస్యను పరిష్కరించేందుకు బ్యాంకులు అవిశ్రాంతంగా పనిచేస్తున్నాయని తెలిపారు. బ్యాంకులు, ఏటీఎంల్లో నగదు అందుబాటులో ఉందని, డిమాండ్‌కు అనుగుణంగా నోట్ల ముద్రణ కూడా జరుగుతోందని ఉర్జిత్‌పటేల్‌ వివరించారు. డెబిట్ కార్డులు ఉపయోగించడం వల్ల చవకగా, తేలిగ్గా లావాదేవీలు జరుపుకోవచ్చన్నారు. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా కొత్త నోట్లు అందుబాటులో ఉంచేలా ప్రింట్రింగ్ ప్రెస్‌లు పూర్తి స్థామర్థ్యంతో పనిచేసేందుకు ఆర్బీఐ, ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. కొత్త నోట్ల సైజు, మందం విషయంలో ప్రజలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తుండటంపై ఆయన స్పందిస్తూ, నకిలీ నోట్ల అక్రమతయారీకి వీల్లేని విధంగా కొత్త కరెన్సీని డిజైన్ చేశామని ఉర్జిత్ పటేల్ సమాధానమిచ్చారు.

ఇక 5వందల నోట్ల కొరత విషయంలో తప్పు తమది కాదని ఆర్బీఐ అధికారులు చెబుతున్నారు. 2వేల నోట్లను ఆర్బీఐ పరిధిలోని ప్రింటింగ్ ప్రెస్‌లో ప్రింట్ చేస్తున్నామని, 5వందల నోట్లు మాత్రం ప్రభుత్వ పరిధిలోని నాసిక్, దేవాస్‌లోని ప్రింటింగ్ ప్రెస్‌లు ముద్రిస్తున్నాయని ఆర్బీఐ అధికారులు చెబుతున్నారు. 5వందల నోటు ముద్రణ తమ పరిధిలో లేదని, అలాంటప్పడు తమపై విమర్శలు ఎలా చేస్తారని ఆర్బీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు.చడం విశేషం. అన్ని రకాల నిర్ణయాలను ప్రభుత్వమే తీసుకుంటుందని, ఆర్థిక శాఖ నోటిఫికేషన్స్‌ను అమలు చేయడం మాత్రమే ఆర్బీఐ పరిధిలో ఉందని ఆర్బీఐ ఉన్నతాధికారులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : urjit patel  rbi  demonetisation  rbi governor  indian citizens  liquidity  bank  ATM centres  

Other Articles