అరవింద్ కేజ్రీవాల్ ను అకాశానికెత్తిన నజీబ్ జంగ్ Jung appreciates Kejriwal, says he agrees 99% of government cases

I agree with kejriwal government in 99 of cases says najeeb jung

Aam Aadmi Party (AAP), aap government, delhi chief minister, Arvind Kejriwal, Delhi, delhi governor, Najeeb Jung, najeeb personal rapport, delhi news

Najeeb Jung said he shared a "personal rapport" with Delhi Chief Minister Arvind Kejriwal, and that the latter "has always been good and a gentleman.".

అరవింద్ కేజ్రీవాల్ ను అకాశానికెత్తిన నజీబ్ జంగ్

Posted: 11/27/2016 11:45 AM IST
I agree with kejriwal government in 99 of cases says najeeb jung

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు అనూహ్యంగా ఓ కీలకమైన వ్యక్తి మద్దతు లభించింది, నిత్యం విమర్శలు, ప్రతివిమర్శలతో ఉప్పూ నిప్పులా ఉండే లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ అరవింద్ కేజ్రీవాల్ ను అకాశానికి ఎత్తేశారు. ప్రభుత్వం తీసుకున్న అన్ని నిర్ణయాలను తన అమోదంతోనే జరపించాలని న్యాయస్థానం చేత కూడా చెప్పించిన వ్యక్తి అనూహ్యంగా తనలోకి మరో కొత్తకోణాన్ని ప్రదర్శించారు. అరవింద్ కేజ్రీవాల్ చాలా మంచి వ్యక్తని, అతనితో తనకు మంచి సంబంధాలున్నాయని నజీబ్ జంగ్ వ్యాఖ్యానించారు. రెండవ ఎడిషన్ 'టైమ్స్ లిట్ ఫెస్ట్' ను ప్రారంభించిన ఆయన 'ఇండియా ఎట్ 70: చేంజస్ బిగిన్ హేర్' అంశంపై ఆయన ప్రసంగించారు.

"కేజ్రీవాల్ ప్రభుత్వం నుంచి నాకు వచ్చే 99 శాతం అంశాలను ఏకీభవిస్తూనే ఉంటాను. కేవలం ఒక్క శాతం కేసుల్లో మాత్రమే ప్రభుత్వ నిర్ణయాన్ని నేను వ్యతిరేకిస్తా" అని అన్నారు. చాలా అంశాల్లో కేజ్రీవాల్ సరైన నిర్ణయాలు తీసుకుంటుంటారని పొగిడారు. ఢిల్లీలో గత 25 సంవత్సరాలుగా పాలనలో ఎలాంటి సమస్యలు తలెత్తలేదని, ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వంపై ప్రజలకు ఎన్నో అంచనాలున్నాయని, వాటిని వీలైనంత త్వరగా అందుకోవాలని ప్రభుత్వం భావిస్తోందని, ఈ కారణంగానే కొన్ని సమస్యలు వస్తున్నాయని జంగ్ వ్యాఖ్యానించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Aam Aadmi Party (AAP)  Arvind Kejriwal  Delhi  Najeeb Jung  

Other Articles