కొత్త రూ. 2000 నోట్ల వచ్చి 15 రోజులు.. అప్పుడే ‘నకిలీ’లలు Rs 2000 fake currency notes printing gang bursted

Rs 2000 fake currency notes printing gang bursted

fake notes, Rs 2000 fake notes, 6 members gang, Rachakonda Commissionerate, Mahesh Bhagwat, L,B nagar, demonetisation, cash withdrawals, Rs 2000 notes, Rs 2000 notes terrorists, Rs 2000 notes original, banks, ATMs, Rs 500, Rs 1,000, notes exchange, RBI, new Rs 500 notes, Nashik press, Currency Ban, notes ban

Taking advantage of the plight of the people due to the cash crunch following demonetization of big notes, the gang printed the fake 2000 rupee notes and waiting to circulate them

కొత్త రూ. 2000 నోట్ల వచ్చి 15 రోజులు.. అప్పుడే ‘నకిలీ’లలు

Posted: 11/26/2016 03:22 PM IST
Rs 2000 fake currency notes printing gang bursted

నవంబర్ 10 2016.. దేశంలోకి ఒక కొత్త నోటు, ప్రస్తుతం దేశంలోనే అత్యంత పెద్ద విలువైన నోటు విడుదలైన రోజు. ఈ నోటు వచ్చి సరిగ్గా పక్షం రోజులు గడుస్తున్నా.. ఇప్పటికీ ఈ నోటు దర్శనం కాని వారు దేశంలో 50 శాతానికి పైగానే వున్నారు. దీని తరువాత మరో నోటు కొత్త 500 రూపాయల కరెన్సీ నోటు అదిగో ఇదిగో అని 10 వ తేదీ నుంచి అందరినీ ఊరిస్తున్నా సుమారు పన్నెండు రోజుల తరువాత ఇది కొందరికి మాత్రమే అందుబాటులోకి వచ్చింది. దీనిని ఇప్పటి వరకు కేవలం 10 శాతం మంది మాత్రమే చూసివుంటారు.

అయితే ఈ కరెన్సీ నోట్లలో గతంలోని కరన్సీ తరహాలోనే భద్రతా ప్రమాణాలను పాటించామని, అంతకు మించి ఏ విధమైన సెక్యూరిటీ ఫీచర్లు లేవని స్వయంగా భారతీయ రిజర్వు బ్యాంకు, కేంద్ర అర్థిక శాఖ కార్యదర్శి శక్తికాంత్ దాస్ చెప్పడంతో.. అది అక్రమార్కుల పాలిట వరంగా పరిణమించింది. దేశంలోని అనేక మంది ప్రజలు బ్యాంకులు, ఏటీయం కేంద్రాల వద్ద క్యూ కట్టి పడిగాపులు కాస్తూ.. డబ్బును తీసుకునేందుకు అవస్థలు పడుతుండటాన్ని తమకు కలసివచ్చిన అవకాశంగా మలుచుకునేందుకు అప్పుడే అక్రమార్కులు సిద్దమైపోయారు.  

దాయాధి పాకిస్థాన్ మన కోత్త నోట్లను ముద్రించడం అసాధ్యమని, పాక్ వల్ల కాదని మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన కేంద్రానికి స్వదేశంలోని అక్రమార్కులే సవాల్ విసురుతూ.. తమ నకిలీ విద్యను ప్రదర్శిస్తున్నారు. రిజర్వు బ్యాంకు కొత్తగా విడుదల చేసిన 2000 రూపాయల నోట్లకు నకిలీ నోట్లను ముద్రిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టుచేశారు. హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ పరిసరాల్లో ఈ ముఠాకు చెందిన ఆరుగురు వ్యక్తులను రాచకొండ కమిషనరేట్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 3 లక్షల రూపాయల విలువైన నకిలీ 2వేల నోట్లు స్వాధీనం చేసుకున్నారు.
 
ముందుగా చిన్న విలువైన నకిలీ నోట్లను ముద్రించి మార్కెట్లోకి ప్రవేశపెట్టిన ఈ ముఠా.. కొత్త నోట్లపై ప్రజల్లో ఇంకా అవగాహన లేకపోవడం, రాకపోవడం, దీనికి తోడు అదనపు సెక్యూరిటీ ఫీచర్లు ఏమీ లేవని అర్బీఐ అధికారులే స్పష్టం చేయడంతో.. కొత్తగా వచ్చిన కరెన్సీని నోట్ల విలువలో కూడా నకిలీ నోట్లను ముద్రిస్తూ వాటిని చెలామణిలోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. ఎనమిది మంది సభ్యులు గల ఈ ముఠాలో అరుగురు పోలీసుల చేతికి చిక్కగా, మరో ఇద్దరు పరారీలో వున్నారని పోలీసులు తెలిపారు,

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles