రీకౌంటింగ్ లో హిల్లరీ గెలవొచ్చు. ఎలాగంటే.. | One Presidential Candidate Has Demanded 3-State Recount

Wisconsin to recount presidential election votes

Wisconsin votes, US presidential elections, Donald Trump, Hillary Clinton, recounting in US elections, Jill Stein Green Party

Election Commission given nod for : Green Party files for recounting of Wisconsin votes.

అమెరికా ఎన్నికల రీకౌంటింగ్ ఎవరికి లాభం?

Posted: 11/26/2016 12:10 PM IST
Wisconsin to recount presidential election votes

అంచనాలను తారు మారు చేస్తూ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయదుంధుబి మోగించాడు. అయితే జనాల్లో ఆయనపై నాటుకు పోయిన వ్యతిరేకత నానాటికీ పెరిగిపోతూనే ఉంది. ఆయన గద్దె ఎక్కాడానికి వీల్లేదంటూ మెజార్టీ ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. మరోవైపు రాజకీయంగా కూడా ఆయన అధ్యక్షుడు కాకుండా ఉండేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

ఈ క్రమంలో రీకౌంటింగ్ అంశం వెలుగులోకి వచ్చింది. హిల్లరీపై స్వల్ఫ ఆధిక్యంతో గెలుపొందిన మూడు రాష్ట్రాల్లో జరపాలంటూ డిమాండ్ లేవనెత్తుతున్నారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన ఎన్నికల సంఘం విస్కాన్సిన్ రాష్ట్రంలో నమోదైన ఓట్లను రీకౌంటింగ్ చేసేందుకు అనుమతి ఇచ్చింది. గ్రీన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జిల్ స్టీన్ చేసిన అభ్యర్థన మేరకు ఓకే చెప్పిన ఈసీ, అందుకు అయ్యే ఖర్చు 1.1 మిలియన్ డాలర్లు( సుమారు 7.5 కోట్లు) ఆమెనే భరించాలని తేల్చి చెప్పింది.

ఈసీ విధించిన డెడ్ లైన్ డిసెంబర్ 13 లోపు రీకౌంటింగ్ పూర్తి చేయాలంటే అధికారులు వారాంతాలు కూడా పనిచేయాల్సి ఉంటుంది. మొత్తం 72 కౌంటీల్లో 30 లక్షల ఓటర్లు ఉన్న విస్కాన్సిన్ లో ట్రంప్ 27 వేల ఓట్ల ఆధిక్యంతో హిల్లరీ పై గెలిచాడు. అయితే ఇంత కష్టపడ్డా హిల్లరీకి లాభం చేకూరటం చాలా కష్టంతో కూడుకున్నదేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మిచిగాన్ లో పది వేల ఓట్ల స్వల్ఫ మెజార్టీతో గెలిచినప్పటికీ, పెన్సిల్వేనియాలో సుమారు 70 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందటంతో అక్కడ రీకౌంటింగ్ లో హిల్లరీకి అవకాశాలు అంతంత మాత్రమేనని వారంటున్నారు. ఒకవేళ అదృష్టం కలిసొచ్చి మూడు ప్రాంతాల్లో గెలుపొంది హిల్లరీ అధ్యక్షురాలు అయ్యే అవకాశం కూడా లేకపోలేదని ఆమె మద్ధతుదారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కానీ, మిగతా రెండు ప్రాంతాల్లో రీకౌంటింగ్ పై ఈసీ ఇంతవరకు స్పందించలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jill Stein  Green Party  US elections  re counting  

Other Articles