క్యూబా కొద‌మ సింహం ఇక లేదు | Cuba's Fidel Castro dies aged 90.

Cuba former president fidel castro dies aged 90

Cuban Revolutionary Leader, Fidel Castro, Fidel Castro death news, Fidel Castro life, Fidel Castro history, Fidel Castro wife, Fidel Castro children, Fidel Castro family, Fidel Castro news, Fidel Castro, Cuba Former President

Cuban Revolutionary Leader And Former President Fidel Castro Dies At 90.

ITEMVIDEOS:కమ్యూనిస్ట్ కిరణం ఫెడల్ కాస్ట్రో కన్నుమూత

Posted: 11/26/2016 11:21 AM IST
Cuba former president fidel castro dies aged 90

క్యూబా మాజీ అధ్యక్షుడు ఫెడల్ కాస్ట్రో మరణించారు. 90 ఏళ్ల ఈ సీనియర్ కమ్యూనిస్ట్ నేత కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హవానాలోని స్వగృహంలో మృతి చెందినట్లు తెలుస్తోంది. సుమారు 50 ఏళ్లపాటు క్యూబాను పాలించిన నేతగా ఆయన చరిత్ర సృష్టించారు. వయసు పైబడటంతో 2008లో అధికారాన్ని తన సోదరుడు రౌల్ కు అప్పజెప్పారు.

ఆయన మృతిపై రౌల్ ఓ అధికారిక ప్రకటన వెలువరించాడు. తమ స్వేచ్ఛ కోసం, ప్రగతి కోసం ఎనలేని కృషి చేసిన ఫెడల్ ను వీరుడిగా, దేవుడిగా క్యూబా ప్రజలు కొలుస్తారు. క్యూబా కొద‌మ సింహం.. సామ్రాజ్య‌వాదుల పాలిట సింహ స్వ‌ప్నంగా ఆయన్ను అభివర్ణిస్తారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం ఆయన్నో నియంతగా పేర్కొనటం విశేషం.

 

1926 ఆగస్ట్ 13న బిరాన్ లోని హోల్టిన్ లో ఫెడల్ జన్మించాడు. అసలు పేరు ఫిదల్ అలెజాంద్రో కేస్త్రో రజ్. 1959-76 దాకా క్యూబా ప్రధానిగా, 1976-2008 వరకు అధ్యక్షుడిగా పని చేశాడు.

పాశ్చాత్య దేశాల్లో తొలి కమ్యూనిస్ట్ దేశాన్ని ఏర్పాటు చేసిన ఘనత క్యాస్ట్రోదే. 1959 లో ఫుల్జెన్సియో బతిస్టాలో మిలిటరీ ప్రభుత్వాన్ని కూలదోసి, కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని స్థాపించారాయన. సామ్యవాద పద్ధతులతో, అందరూ సమానమే అనే సిద్ధాంతంతో క్యూబాను ఆభివృద్ధి బాట పట్టించారు. తన తుది శ్వాస విడిచేంత వరకు కూడా కమ్యూనిస్టు సిద్ధాంతాల పరిరక్షణకు ఆయన కృషి చేశారు.

Fidel Castro Rare Photos

అగ్రరాజ్యం అమెరికా విధానాలను ఎదిరించి నిలిచిన క్యాస్ట్రో అమెరికా కంట్లో నలుసులా మారారు. ఆయనపై ఎన్నో హత్యాయత్నాలు జరిగినప్పటికీ... ఆయన ప్రాణాలను మాత్రం బలిగొనలేకపోయాయి. ఫిడెల్ క్యాస్ట్రో ఇక లేరు అన్న వార్తతో యావత్ క్యూబా కంటనీరు పెడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు... ఆయన మరణవార్తతో విషాదంలో మునిగిపోయారు.

క్యూబా దేశాధినేతగా భారతకు వచ్చిన వీర విప్లవ యోధుడు ఫెడల్‌ క్యాస్ట్రో, నాడు ధీర వనితగా గుర్తింపు పొందిన నాటి భారత ప్రధాన మంత్రి ఇందిరా గాంధీని ఆత్మీయ ఆలింగనం చేసుకోవడం రెండు దేశాల స్నేహ సంబంధాల చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయింది. నాడు ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా అలీన దేశాల్లో ఆ ఫొటో చెరగని ముద్ర వేసింది. 

Fidel Castro India

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Cuban Revolutionary Leader  Fidel Castro  Dies  

Other Articles