ఫస్ట్ టైం ఇండియాలోనే హైదరాబాద్ ఖాతాలో ఆ రికార్డు | India's First wifi city Hyderabad.

Another record for hyderabad

Telangana, Hyderabad, India, Wifi City Hyderabad, Another record for Hyderabad, Hyderabad record, hyderabad free wifi city, India's first free wifi city

Telangana Capital City Hyderabad becomes first wifi city in India.

ఇండియాలోనే ఫస్ట్ టైం హైదరాబాద్ లో...

Posted: 11/26/2016 08:32 AM IST
Another record for hyderabad

తెలంగాణ రాష్ట్ర రాజధాని భాగ్య‌న‌గ‌రంను విశ్వనగరంగా తీర్చిదిద్దాలన్న కేసీఆర్ కలకు మరో అడుగు ముందుకు పడబోనుంది. టెక్నాలజీ పరంగా దేశంలోనే తొలి పూర్తిస్థాయి వైఫై న‌గ‌రంగా రూపుదిద్దేందుకు టీ సర్కార్ ప్రణాళిక రచించింది. ప్ర‌భుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ సహకారంతో వైఫై సేవ‌ల విస్త‌ర‌ణ‌కు రెడీ అయింది. మహానగరం మొత్తం హాట్‌స్పాట్లు ఏర్పాటు చేసి ఫ్రీ వైఫై సేవ‌లు అందించేందుకు రంగం సిద్ధం చేస్తోంది.

న‌గ‌రంలో మొత్తం 150 వైఫై హాట్‌స్పాట్స్ ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించింది. ఇందుకోసం క్వాడ్జ‌న్ సంస్థ‌తో ఒప్పందం చేసుకుంది. ఇప్ప‌టికే 49 హాట్‌స్పాట్లు ఏర్పాటు చేసి వైఫై సేవ‌లు అందిస్తోంది. దీనిని మ‌రింత విస్త‌రించి స్మాల్‌, మీడియం, లార్జ్ హాట్‌స్పాట్లు ఏర్పాటు చేసి న‌గ‌ర‌మంతా ఉచిత వైఫై సేవ‌లు అందించ‌నుంది. ఒక్కో హాట్‌స్పాట్‌కు ఐదు వైఫై ట‌వ‌ర్లు, ఒక్కో ట‌వ‌ర్ ఐదు నుంచి ప‌ది కిలోమీట‌ర్ల ప‌రిధిలో సేవ‌లు అందించేలా తీర్చిదిద్ద‌నున్నారు. హాట్‌స్పాట్స్ వినియోగ‌దారులు 2 నుంచి 10 ఎంబీల వ‌ర‌కు డేటాను డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.

ఇక బీఎస్ఎన్ఎల్ వినియోగ‌దారుల‌కు వైఫై మ‌రింత ప్ర‌యోజ‌న‌క‌రంగా మార‌నుందని సంస్థ ప్రిన్సిప‌ల్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ రాంచంద్ తెలిపారు.. బీఎస్ఎన్ఎల్ 3జీ వినియోగదారులు వైఫై జోన్‌లో ప్ర‌వేశించ‌గానే మొబైల్ డేటా దానంత‌ట అదే ఆగిపోయి వైఫై యాక్టివేట్ అవుతుంది. మొబైల్ డేటా ప్లాన్ ప్ర‌కారం డేటాను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.

ఇత‌ర నెట్‌వ‌ర్క్‌ల వినియోగదారులు తొలి 15 నిమిషాల పాటు వైఫై సేవ‌లను ఉచితంగా వినియోగించుకోవ‌చ్చు. ఆ త‌ర్వాత వోచ‌ర్లు, క్రెడిట్‌, డెబిట్ కార్డుల‌ను ఉప‌యోగించి సేవ‌లు పొంద‌వ‌చ్చు. న‌గ‌రంలో ఉచిత వైఫై సేవ‌లు వ‌చ్చే ఏడాది మార్చి నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  Hyderabad  India  free wifi city  

Other Articles