బాయ్ ఫ్రెండ్ బిత్తరి చర్య.. గగ్గోలు పెట్టిన గర్ల్ ఫ్రెండ్ Is this the worlds worst boyfriend

Man drops two giant pythons on sleeping girlfriend

boyfriend, PYTHONS, worst, drops, giant pythons, worst boyfriend, girlfriend, boy friend films girl friends reactions, filming reaction, friends, crazy people, funny video, trending video

As boyfriends go, this guy is surely a contender for the world's worst as he drops two gaint pythons on sleeping girl friend and films her reactions.

ITEMVIDEOS: బాయ్ ఫ్రెండ్ బిత్తరి చర్య.. గగ్గోలు పెట్టిన గర్ల్ ఫ్రెండ్

Posted: 11/24/2016 11:34 AM IST
Man drops two giant pythons on sleeping girlfriend

మంచి నిద్రలో వుండగా ఎవరైనా చిన్న శబ్దం చేస్తేనే కంగారుపడి లేస్తాం. అయితే గాఢనిద్రంలో వుండగా ఒంటిపై ఏదైనా పాకినట్టు వుంటే ఏం చేస్తాం.. వెంటనే భయపడి లెగుస్తాం. అయితే ఇలా నిద్రలో వున్నవారిని హడలెత్తించేలా లేపకూడదని, అది ప్రమాదకరమని ఇప్పటికే పెద్దలు అనేక పర్యాయాల్లో చెప్పారు. దీనికి వైద్యపరంగా కూడా కారణాలు చెప్పారు. ముఖ్యంగా హృద్రోగాలకు ఇలాంటి చర్యలు కారణమని, ఇక ఆ పరమైన వ్యాధులతో బాధపడుతున్న వారు షాక్ గురై గుండే అగే ప్రమాదం కూడా వుంటుందని వివరించారు.

ఈ విషయాలు తెలిసో, తెలియకో ఓ ప్రబుద్దుడు బిత్తర చర్యకు పాల్పడ్డాడు. తన గర్లఫ్రెండ్ పై ఓ ప్రయోగాన్ని చిత్రీకరించాలని భావించాడు. అమె గాఢనిద్రలో వుండగా తన మిత్రులతో కలసి ఈ చర్యకు దిగాడు. అదేం చర్య అనుకుంటున్నారా..? అమె గాఢనిద్రలో వుండగా, అమె మీద రెండు పేద్ద కొండ చిలువలు తెచ్చి పడేశాడు‌. పైథాన్లు మీద పడి పాకుతుండగా, ఉల్లికిపడి లేచిన అమె వాటిని చూసి బిగ్గరగా కేకలు వేసింది. వాటిని తన బెడ్ పైనుంచి తీసేయాలని గగ్గోలు పెట్టింది.

కొంత సేపటి వరకు అలాగే వాటిని బెడ్ పైనుంచి బాయ్ ప్రెండ్, అతని స్నేహితులు అమె వాటిని చూసి ఎలా స్పందించిందన్న దృశ్యాన్ని వీడియో తీసి ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌లలో పెట్టాడు. అయితే ఇప్పడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వ్యూల కోసమో లేక లైకుల కోసమో తెలియదు కానీ.. జరగరానిది ఏమైనా జరిగి వుంటే.. ఎలా అన్న కామెంట్లు కూడా వస్తున్నాయి. పరుల ప్రాణాల మీదకు వచ్చే చర్యలకు పాల్పడటం ఎంతవరకు సమంజసమో వారికే తెలియాలి. ఈ వీడియోతో డెరెక్‌ డెస్కో అనే ప్రబుద్ధుడు తనది ప్రాక్టికల్‌ జోక్‌ అని సమర్థించుకున్నా.. అతనో చెత్త బాయ్ ఫ్రెండ్ అన్న బిరుదును మాత్రం సొంతం చేసుకున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : worst boyfriend  pythons  girlfriend  filming reaction  friends  crazy people  funny video  trending video  

Other Articles