నోట్ల రద్దుపై మోడీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. set back to centre on demonetisation

Supreme court refuses to stay petitions against demonetisation

Supreme Court, Currency ban,Notes Ban,Prime Minister Narendra Modi, demonetisation, parliament session, congress, rbi rules, pm modi demonetisation, demonetisation rules, rbi demonetisation, atm demonetisation, atm waiver, atm withdrawal, atm withdrawal charges, india news

The government suffered another jolt with the Supreme Court refusing to restrain high courts from taking up issues arising out of demonetisation.

నోట్ల రద్దుపై మోడీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ..

Posted: 11/24/2016 10:35 AM IST
Supreme court refuses to stay petitions against demonetisation

అవినీతి, నల్లధనంపై యుద్దాన్ని ప్రకటించిన కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వానికి దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది .పెద్ద నోట్ల రద్దును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా పలు న్యాయస్థానాల్లో దాఖలైన పిటీషన్లను విచారించకుండా అదేశాలు ఇవ్వాలన్న కేంద్ర ప్రభుత్వ వినతిని సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. దేశంలోని వివిధ కోర్టుల్లో దాఖలైన అన్ని కేసును ఒకే చోట విచారించాలని ఈ నెల 18న సుప్రీంకోర్టు అదేశాలిచ్చిన నేపథ్యంలో దీనిపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.

ప్రస్తుతం పరిస్థితి చాలా వరకూ మెరుగుపడిందని, బ్యాంకులు, ఏటీఎంల వద్ద క్యూలు తగ్గాయని, ఆన్‌లైన్‌లో నగదు వినియోగం బాగా పెరిగిందని అందువల్ల హైకోర్టుల్లో కేసుల విచారణపై స్టే విధించాలన్న కేంద్రం వినతిని తిరస్కరించిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. కేవలం క్యూ లైన్లు, నదగు నిల్వల మాత్రమే కాదు.. దాఖలైన పలు పిటీషన్లలో అనేక అంశాలు పొందుపచ్చబడ్డాయని  పేర్కోంది. వీటిపై ప్రజలు హైకోర్టుల నుంచి తక్షణ ఉపశమనం పొందుతారు’ అని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎల్ నాగేశ్వరరావుతో కూడిన బెంచ్  పేర్కొంది.

అవినీతిని కట్టడి చేసి నల్లధన కుబేరుల నుంచి పన్ను వసూలు చేయడంతో పాటు నకిలీ కరెన్సీ ఏరివేతకు కేంద్రం తీసుకున్న పెద్దనోట్ల రద్దు విజయవంతమైందని, అప్పుడే ఈ నిర్ణయానికి సంబంధించిన ఫలితాలు కూడా వెలువడుతున్నాయని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ కోర్టుకు తెలిపారు. ఇప్పటి వరకూ రూ. 6 లక్షల కోట్లు డిపాజిట్లు వచ్చాయని, డిసెంబర్ చివరికి ఈ మొత్తం రూ. 10 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉందని అన్నారు. కాగా కేంద్రం వాదనలతో కోర్టు సంతృప్తి చెందకపోవడంతో కేసు తదుపరి విచారణను డిసెంబర్ 2వ తేదీకి వాయిదా వేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Supreme Court  Currency ban  Notes Ban  demonetisation  congress  Prime Minister Narendra Modi  

Other Articles