మురళి మూగబోయింది | Mangalampalli Balamuralikrishna passes away

Mangalampalli balamuralikrishna passes away

Mangalampalli Balamurali Krishna,Mangalampalli death, Mangalampalli passesaway, Mangalampalli no more, Aparatyagayya passes away, Mangalampalli Balamurali Krishna, Mangalampalli Balamurali Krishna NTR clash, Mangalampalli Balamurali Krishna history, Mangalampalli Balamurali Krishna movies, Mangalampalli Balamurali Krishna music director

Mangalampalli Balamurali Krishna passes away.

ITEMVIDEOS:మంగళంపల్లి బాలమురళీకృష్ణ కన్నుమూత

Posted: 11/22/2016 05:22 PM IST
Mangalampalli balamuralikrishna passes away

ప్రముఖ సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీ కృష్ణ ఇక లేరు. అపరత్యాగయ్యగా పేరుగాంచిన 86 ఏళ్ల మంగళంపల్లి చెన్నై లోని ఆయన స్వగృహంలో కన్నుమూశారు. 1930 జూలై 6 తూర్పుగోదావరి జిల్లా శంకరగుప్తంలో ఆయన జన్మించారు. 400 సినిమాలకు పైగా సంగీతం సమకరూర్చాడు. 1976, 1987 లో ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకున్నారు.

కేంద్ర ప్రభుత్వం ఆయన్ను పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలతో సత్కరించింది. 25వేలకు పైా సంగీత కచేరీలు నిర్వహించిన ఘనత ఆయన అందుకున్నారు. పలు నాటకాలతోపాటు, భక్త ప్రహ్లాదలో నారదుడి గెటప్ లో, మరికొన్ని చిత్రాల్లో ఆయన నిజపాత్రనే పోషించి అలరించాడు. భార్య పేరు అన్నపూర్ణ. ఆరుగురు సంతానం. ముగ్గురు ఆడపిల్లలు, ముగ్గురు మగపిల్లలు.

 

ఎన్టీఆర్ తో గొడవ...
ఎన్టీఆర్ కి ‘నర్తనశాల’, ‘శ్రీమద్విరాటపర్వము’ లాంటి చిత్రాల్లో మంచి పాటలు పాడిన ఆయనకి తర్వాత గొడవ జరిగింది. లలిత కళా అకాడెమీలన్నిటినీ రద్దు చేసేసరికి, భేదాభిప్రాయం వచ్చింది. కళాకారులకు అవమానం జరిగిందనే బాధతో తెలుగు నేలపై కచేరీ చేయనని భీష్మించుకుని కూర్చున్నాడు. ఆపై ఏడేళ్ళ విరామం తరువాత ముఖ్యమంత్రి చెన్నారెడ్డిగారి అభ్యర్థనతో మళ్ళీ హైదరాబాద్‌లో పాడారు. తరువాత మళ్ళీ ముఖ్యమంత్రి అయిన ఎన్టీఆర్ తన తప్పు తెలుసుకొని, పంథా మార్చుకొని, సాదరంగా మళ్ళీ పిలిచి, గౌరవించడంతో వెళ్లి పాడారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mangalampalli Balamurali Krishna  Passes away  

Other Articles