నాసా లైవ్.. యుఎఫ్ఓలకు మరో ప్రత్యక్ష సాక్ష్యం.. Nasa cuts ISS live feed when bright object moved quickly across the earth?

Nasa cuts iss live feed when bright object moved quickly across the earth

UFO sightings 2016,Nasa cuts ISS live feed,bright object,moved quickly across the earth,unidentified flying objects, International Space Station, UFO, Nasa,

The latest we heard is that a bright object was spotted flying across the earth at great speed in Nasa's live video feed captured from International Space Station

ITEMVIDEOS: నాసా లైవ్ లో యుఎఫ్ఓ.. ఐఎస్ఎస్ చేతికి మరో సాక్ష్యం..

Posted: 11/18/2016 02:28 PM IST
Nasa cuts iss live feed when bright object moved quickly across the earth

గుర్తు తెలియని ఎగిరే వస్తువులు భూమి మీదకు వస్తాయని గత కొన్నాళ్లుగా శాస్త్రవేత్తలు చెప్పడమే కాదు అప్పడప్పుడు భూలోక వాసులకు అక్కడక్కడా దర్శనమిస్తూ కూడా ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఈ క్రమంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్‌ఎస్‌) సమీపంలో వేగంగా ప్రయాణిస్తున్న వస్తువు ఒక్కటి నాసా లైవ్‌ ప్రసారంలో కనిపించడం ఇటీవల కలకలం రేపింది. ఇది కనిపించిన కాసేపటికే ప్రసారాలు నిలిచిపోయాయి. దీంతో అది యూఎఫ్‌వో అయి ఉంటుందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

రోదసిలో భూపరిధికి కాస్త ఎత్తులో చీకటి నుంచి వేగంగా ప్రయాణిస్తున్న చిన్న చుక్కలాంటి వస్తువు ఒక్కటి ఐఎస్‌ఎస్‌ చానెల్‌లో దర్శనమిచ్చింది. లైవ్‌లో ఇది ఐదు సెకన్లు మాత్రమే కనిపించింది. ఆ వెంటనే లైవ్‌ ప్రసారాలు నిలిచిపోయాయి. ఈ వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేసిన ‘కోల్డ్‌పైరో’ అనే నెటిజన్ ఇది యూఎఫ్‌వో అయి ఉంటుందని, దీనిని గుట్టుగా ఉంచేందుకే నాసా లైవ్‌ ప్రసారాల్ని అకస్మాత్తుగా కట్‌ చేసిందని వ్యాఖ్యానించాడు. అయితే సాంకేతిక కారణాల వల్లే లైవ్‌ ప్రసారం నిలిచిపోయిందని నాసా పేర్కొంది.

యూఎఫ్‌వో అన్వేషకులు మాత్రం ఇది అద్భుతమైన వీడియో అని, భూమికి చేరువలో యూఎఫ్‌వోలు తిరుగుతున్నాయనడానికి ఇది నిదర్శనమని అంటున్నారు. మరికొందరు మాత్రం వేగంగా ప్రయాణిస్తూ వెళ్లిన ఆ వస్తువు యూఎఫ్‌వో అనడానికి ప్రామాణిక ఆధారం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. విశ్వంలో అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతుండటం సాధారణమేనని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles