ఆ మరణాలకు బాధ్యులు బీజేపీ బ్యాచులర్లేనా.. Baba Ramdev on demonetisation: 'BJP has many bachelors'

Many bjp members are bachelors did not realise it was wedding

baba ramdev, baba ramdev demonetisation, demonetisation effect, demonetisation currency, currency withdrawal, withdrawal cash, cash withdrawl currency, demonetisation wedding, wedding season demonetisation, india news

In a humorous take on this, Yoga guru Baba Ramdev said “many in the BJP are bachelors and that they did not realise it was wedding season, that was the mistake”

ఆ మరణాలకు బాధ్యులు బీజేపీ బ్యాచులర్లేనా..

Posted: 11/18/2016 12:02 PM IST
Many bjp members are bachelors did not realise it was wedding

పెద్దనోట్లను రద్దుచేస్తూ ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం వల్ల దేశంలోని అనేక కుటుంబాలు కష్టాలు పడుతున్నాయి. దేశంలో తలెత్తిన ఆర్తిక ఎమర్జెన్సీకి నేపథ్యంలో చేతిలో డబ్బులున్నా.. వాటిని అవసరానికి ఇవ్వలేక.. తీసుకోనూ లేక దేశవ్యాప్తంగా పలువురు మరణించారు. మరికోందరు క్యూ లైన్లలో నిల్చుని గుండెపోటుకు గురై అసువులు బాసారు. మరీ ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్‌లో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల పెద్ద ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ ఇబ్బందులను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం వివాహాలు జరుపుతున్న కుటుంబాలు ఒకేసారి రూ. 2.5 లక్షల వరకు బ్యాంకుల నుంచి తీసుకోవచ్చునని ప్రకటించాయి.
 
తమ ఇంటి పెద్దలను కొల్పోయిన కుటుంబాలు ఈ ఘటనలతో మరింత దుఃఖసాగరంలో మునిగిన సమయంలో.. అవి కేవలం పార్టీలోని బ్రహ్మచారుల వల్లే జరిగాయని చాలా ఈజీగా తీసిపారేశారు యోగా గురువు బాబా రాందేవ్‌. పెళ్లిళ్ల సీజన్‌లో ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణం బీజేపీలోని బ్రహ్మచారులేనంటూ ఛలోక్తులు విసిరారు. ‘బీజేపీలో చాలామంది బ్రహ్మచారులే. అందుకే వారికి ఇది పెళ్లిళ్ల సీజన్‌ అని తెలియలేదు. అది వారి పొరపాటు’ అంటు జోక్‌ చేశారు. ‘15 లేదా నెలరోజుల తర్వాత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొని ఉంటే పెళ్లిళ్లు ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొనేవి కావు. ఈ నిర్ణయం వల్ల ఒక మంచి కూడా జరిగింది. చాలామంది కట్నం అడగటం లేదు’ అని నవ్వుతూ పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : baba ramdev  demonetisation  currency withdrawal  wedding season  india news  

Other Articles