గృహనిర్భంధంలోనే ముద్రగడ.. కదిలికలపై పోలీసుల డేగ కన్ను House arrest of mudragada continues in East Godavari

House arrest of mudragada padmanabham continues in east godavari

mudragada padmanabham, padayatra, kapu satyagraha yarta, kapu reservations, chandrababu naidum TDP government, AndhraPradesh

House arrest of prominent Kapu leaders continues to thwart Satyagraha Padayatra proposed by former minister Mudragada Padmanabham seeking inclusion of the caste in BC list.

గృహనిర్భంధంలోనే ముద్రగడ.. కదిలికలపై పోలీసుల నిఘాగృహనిర్భంధంలోనే ముద్రగడ.. కదిలికలపై పోలీసుల నిఘా

Posted: 11/18/2016 08:47 AM IST
House arrest of mudragada padmanabham continues in east godavari

మూడేళ్ల క్రితం ఆయన తెలుగుదేశం పార్టీకి అత్యంత కావాల్సిన వ్యక్తి. ఆయన ఆ పార్టీకి ముందు పెట్టిన అన్ని డిమాండ్లను అంగీకరించిడంతో పాటు పార్టీ విడుదల చేసిన మానిఫెస్టోలో కూడా ఆయన డిమాండ్లను ప్రస్తావించారు. ఇప్పుడు ఆ పార్టీ అధికారంలోకి రావడం.. డిమాండ్లను నెరవేర్చాలని పట్టుబట్టడంతో ఆయన ప్రభుత్వానికి శత్రువుగా మారారు. ఎంతలా అంటే ఆయన చేస్తున్న పాదయాత్రను కూడా జీర్ణంచుకోలేని ప్రభుత్వం ఆయనను ఏకంగా నాలుగు రోజులుగా గృహనిర్భందంలో వుంచింది. ఆయన మరెవరో కాదు కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం.

ప్రస్తుతం ముద్రడగ నివాసం వద్ద పోలీసులు పహారా కాస్తున్నారు. ఆయనను తన నివాసంలో నుంచి బయటకు రానీయకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇక అటు బయట వ్యక్తులు కూడా ఇంట్లోకి రాకుండా అంక్షలు విధించారు, దీంతో పాటు క్లిరంపుడి సహా తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. పోలీసులు ఇచ్చిన 48 గంటలు గడువు ముగిసినా పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. అంతేకాకుండా ముద్రగడ నివాసం వద్ద ప్రతి కదలికను పోలీసులు బాడీ వార్న్‌ కెమెరాలతో చిత్రీకరిస్తున్నారు.

ఈ సందర్భంగా ముద్రగడ పద్మనాభం మాట్లాడుతూ పోలీసుల నుంచి తనకు స్వేచ్ఛ కలిగినప్పుడే జేఏసీతో చర్చించి సత్యాగ్రహ యాత్రపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎన్నిరోజులు ఇంట్లో ఉండమంటే అన్ని రోజులూ ఉంటానని, పోలీసులు వెళ్లిపోయి తనకు స్వేచ్ఛ ఇస్తే పాదయాత్ర చేపడతానని అన్నారు,  పోలీసులు వెనక్కు వెళ్లిపోతే పాదయాత్ర  తేదీలు ప్రకటిస్తానని ముద్రగడ స్పష్టం చేశారు.

మరోవైపు  కాపు జేఏసీ నేతలు ఆకుల రామకృష్ణ, నల్లా విష్ణు,  వాసురెడ్డి ఏసుదాసు ,కల్వకొలను తాతాజీ, వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా తదితరుల గృహ నిర్బంధాలు కొనసాగుతున్నాయి. కాగా రావులపాలెం నుంచి అంతర్వేది వరకు కాపు సత్యాగ్రహ పాదయాత్రకు సిద్ధమయిన ముద్రగడ సహా పలువురు కాపు జేఏసీ నేతలను మంగళవారం ప్రభుత్వం నిర్బంధించిన సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles