ఆటలో సహచరుడిపై మండిపడ్డ విరాట్, వీడియో ఔట్ Misunderstanding between Virat Kohli and Cheteshwar Pujara

Misunderstanding between virat kohli and cheteshwar pujara

India vs England, visakha test, first innings, virat kohli, cheteshwar pujara, gautam gambhir,Team india, second test, day 1, score update, r ashwin, wriddhiman saha, Virat Kohli, Adil Rashid ,India vs England score

Virat Kohli and Cheteshwar Pujara made big tons for India, but their concentration was severely tested with both batsman in the nervous nineties when the canine streaker interrupted play.

ఆటలో సహచరుడిపై మండిపడ్డ విరాట్, వీడియో ఔట్

Posted: 11/17/2016 06:43 PM IST
Misunderstanding between virat kohli and cheteshwar pujara

విశాఖ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ సహచరుడు ఛటేశ్వర్ పుజారాపై ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. తొలిరోజు ఆటలో ఇంగ్లాండ్ పై టీమిండియా పై చేయి ప్రదర్శించడానికి కారణమైన వీరిద్దరూ చక్కని శతకాలతో రాణించి.. మూడో వికెట్ కు మంచి (226 పరుగుల) భాగస్వామ్యాన్ని కూడా నమోదు చేశారు,

అయితే సెంచరీలతో చెలరేగిన ఈ ఇద్దరి మధ్య.. ఆటలో జరిగిన ఆసక్తికర సన్నివేశం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. కెఎల్ రాహుల్ రాకతో పెవీలియన్ కు మాత్రమే పరిమితమైన టీమిండియా సినియర్ ఆటగాడు గౌతమ్ గంభీర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఓపెనర్లిద్దరూ విఫలం కావడంతో టీమిండియా ఇన్నింగ్స్ ను నిర్మించాల్సిన బాధ్యత వీరిద్దరిపై పడింది. ఈ దశలో ఆదిల్‌ రషీద్‌ వేసిన 18వ ఓవర్లో సింగిల్ తీసే ప్రయత్నంలో పుజారా ముందుకు దూసుకొచ్చాడు.

కోహ్లీ అతనిని వారించడంతో వేగంగా వెనక్కి వెళ్లిన పుజారా బ్యాటు వదిలేసి మరీ డైవ్ చేసి అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అనంతరం మరోసారి సింగిల్ కోసం ప్రయత్నించి, వెనుదిరిగి బ్యాటుతో సహా డైవ్ చేసి అవుట్ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. దీంతో నిలకడగా ఆడాల్సిన టైమ్ లో లేని పరుగు కోసం పరుగెత్తాల్సిన అవసరం ఏంటని కోహ్లీ, పుజారాను మందలించినట్టు వీడియోలో కనిపిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles