సేవింగ్స్ అకౌంటు ఖాతాదారులకు అర్బీఐ ఊరట RBI tells banks to waive ATM usage fee

Rbi directs banks to waive atm charges till december 30

demonetisation, pm modi demonetisation, demonetisation rules, rbi demonetisation, atm demonetisation, atm waiver, atm withdrawal, atm withdrawal charges, india news

The Reserve Bank of India in a circular on Monday directed banks to waive ATM charges for their customers and others till December 30, 2016.

సేవింగ్స్ అకౌంటు ఖాతాదారులకు అర్బీఐ ఊరట

Posted: 11/15/2016 10:59 AM IST
Rbi directs banks to waive atm charges till december 30

అవినీతి, నల్లధనం, నకిలీ నోట్లపై కేంద్రంలోని మోడీ ప్రభుత్వం యుద్దాన్ని ప్రకటించి వారం రోజులు గడుస్తున్నా.. నోట్ల మార్పు కోసం.. అనేక మంది బ్యాంకుల వద్ద, డబ్బులు డ్రా చేసుకునేందుకు విధించిన పరిమితులతో పలువరు ఏటీయం కేంద్రాల వద్ద గంటల తరబడి క్యూ లైన్లలో నిల్చుంటున్నారు. ఈ క్రమంలో వారిలో అనేక సందేహాలు, అనుమాలను వ్యక్తం చేస్తూ పక్కవారితో చర్చోపచర్చలు పెడుతున్నారు. వారి మదిని తొలుస్తున్న అనేక సందేహాలలో ముఖ్యంగా ఏటీయం కేంద్రాలలో వున్న డబ్బు డ్రా చేసే పరిమితి.. వాటిపై వేసే చార్జీల అంశం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది.

రోజుకు రెండున్నర వేల రూపాయలను మాత్రమే డ్రా చేసుకునే అవకాశం వుండటంతో తమకు మూడు సార్లు మాత్రమే ఖాతా వున్న బ్యాంకు ఏటీయంలో, ఆ తరువాత రెండు పర్యాయాలు ఇతర బ్యాంకు ఏటీయంలలో డబ్బును డ్రా చేసుకునే అవకాశం వుందని, ఈ నేపథ్యంలో ఐదు పర్యాయాలు దాటినా.. తరువాత తాము విత్ డ్రా చేసుకునే డబ్బుపై ఏటీయం చార్జీలు కూడా కలవర పెట్టాయి. ఈ నేపథ్యంలో కస్టమర్లు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు రిజర్వు బ్యాంకు కీలక నిర్ణయం తీసుకుంది.

ఏటీఎంల ద్వారా జరిపే లావాదేవీలపై డిసెంబరు 30 వరకు ఎటువంటి చార్జీలను వసూలు చేసేది లేదని ప్రకటించింది. అయితే ఇది సేవింగ్స్ ఖాతాదారులకు మాత్రమే వర్తిస్తుందని, డెబిట్ కార్డులపై ఉన్న పరిమితిని ఎత్తివేస్తున్నట్టు తెలిపింది. తమ బ్యాంకులతోపాటు ఇతర బ్యాంకుల్లో నెలలో ఎన్నిసార్లు అయినా లావాదేవీలు చేసుకోవచ్చని, పరిమితి లేదని, చార్జీలు వసూలు చేయబోమని ప్రకటించింది.

ప్రస్తుతం సొంతబ్యాంకు ఏటీఎం నుంచి నెలకు ఐదుసార్లు, ఆరు మెట్రో నగరాల్లో ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి నెలకు మూడుసార్లు మాత్రమే ఉచితంగా లావాదేవీలు జరుపుకునే అవకాశం ఉంది. ఈ పరిమితి దాటితే ప్రతి లావాదేవీకి నెలకు రూ.20 చొప్పున వసూలు చేస్తారు. ప్రస్తుతం పెద్ద నోట్లు రద్దు చేయడం, కొత్త నోట్లు పొందడానికి పరిమితులు విధించడంతో డెబిట్ కార్డును పలుమార్లు ఉపయోగించాల్సిన పరిస్థితి తలెత్తింది. దీనిని దృష్టిలో పెట్టుకున్న రిజర్వ్ బ్యాంకు డెబిట్ కార్డు వినియోగంపై ఉన్న ఆంక్షలను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles