అధ్యక్ష పగ్గాలు చేపట్టే తరుణంలో.. ట్రంప్ కు ఒబామా వార్నింగ్ Obama warns Trump against ripping up Iran deal

Obama warns trump s temperament will be his doom

obama, barack obama, obama on trump, donald trump, obama donald trump, obama warns trump, obama warns donald trump, world news

President Barack Obama has warned there are "certain elements" of Donald Trump's temperament that will not serve him well "unless he recognises them and corrects them".

కాబోయే అధ్యక్షుడు ట్రంప్ కు ఒబామా స్ట్రాంగ్ వార్నింగ్..!

Posted: 11/15/2016 10:29 AM IST
Obama warns trump s temperament will be his doom

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికై త్వరలో పదవీబాధ్యతలను చేపట్టనున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ కు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.  ట్రంప్ తన టెంపర్ తగ్గించుకుంటే అది దేశానికే మంచిదని ఆయన సూచించారు. ట్రంప్ లా ఎలాంటి టెంపర్ మెంట్ వున్నా.. పర్వాలేదు కానీ అమెరికా అధక్షుడి హోదాను అందుకోనున్న తరుణంలో మునుపటిలాగా వ్యవహరిస్తే బాగోదని చెప్పారు. ఆయన మాట్లాడే ప్రతి మాటను ఇక నుంచి చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుందని సూచించారు.

అమెరికా అధ్యక్షుడుగా ఎన్నికైన ఆయనకు తెల్లవారు జామున కూడా ఫోన్ కాల్స్ వస్తుంటాయి. వాటికి ఓపిగ్గా ఆయన బదులివ్వాలని.. తన ఆవేశాన్ని కొంత సర్దుకోవాలని సూచించారు. జనవరిలో బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన కలుసుకునే వారితో సహనంగా మెలిగాలన్నారు. ఒక వేళ ఎప్పుడైనా నోరు జారినా.. వాటిని సరిచేసుకోవాలని.. ఇకపై అలాంటివి జరగకుండా  చూసుకోవాలని సూచించారు. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్న ట్రంప్ వైపు ప్రపంచమంతా ఆసక్తిగా గమనిస్తుందని.. అందుకే ఆయన జాగ్రత్తగా వ్యవహరించాలని ఒబామా అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : US president  barack obama  donald trump  temperment  White House  

Other Articles