అమ్మాయిలు ధైర్యంగా ఉంటేనే దేశం బాగుప‌డుతుంద‌ి | pawan Kalyan on woman security at Gutti interaction

Pawan on woman security at gutti interaction

Janasena Chief, Pawan Kalyan, Pawan kalyan GATES speech, Pawan Kalyan Speech, Pawan kalyan Murder, Pawan Kalyan woman protection, pawan Gutti Speech

pawan Kalyan on woman security at GATES interaction with studebts.

వాడిని చంపేద్దామనుకున్నా.. సీమ దత్తతకు రెడీ: పవన్

Posted: 11/11/2016 12:30 PM IST
Pawan on woman security at gutti interaction

అనంతపురంలో గుత్తి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించిన పవన్ మరోసారి భావోధ్వేగమైన ప్రసంగాన్ని కొనసాగించాడు. ముఖ్యంగా అమ్మాయిల భద్రత గురించి ప్రస్తావించిన పవన్ తన చిన్నప్పుడు ఎదురైన అనుభవాలను గుర్తు చేసుకున్నాడు. "నా చిన్నతనంలో మా అక్కను ఏడిపించారు. అప్పుడు నాకు వాళ్లను చంపేద్దామని అనుకున్నా. అంత కోపం వచ్చింది. ఆడవాళ్లు బయటకు వెళితే, ఇలాంటి వేధింపులు తప్పవా? ఈ పరిస్థితి మారాలన్న ఆలోచన అప్పటి నుంచే నా మనసులో ఉండిపోయింది." అన్నాడు.

జనసేన అధికారంలోకి వస్తే, విద్యార్థినుల ఆత్మగౌరవాన్ని అవమానించిన వారెవరైనా, వారిని కొట్టినా, తిట్టినా కేసులు ఉండకుండా చేస్తామని హామీ ఇచ్చారు. అమ్మాయిలు ఇంట్లో అయినా, వీధిలో అయినా ఒంటరిగా ఉండేందుకు, నడిచి వెళ్లేందుకు వీలు కల్పించే, భద్రత అందించే సమాజం రావాలన్నదే తన లక్ష్యమని చెప్పారు.

ఢిల్లీలో నిర్భ‌య ఘ‌ట‌న జ‌రిగితే త‌ప్పా మీకు ఆ చ‌ట్టం తీసుకురావాల‌ని తెలియ‌లేదా..? అంటూ ప్రభుత్వాలను, నేతలను ప్రశ్నించాడు. అమ్మాయిల వెంట ప‌డేవారిని చెప్పుతో కొట్టాలని సూచించారు. దేశం బాగుప‌డాలంటే ఆడ‌పిల్ల‌లు ధైర్యంగా ఉండాల‌ని చెప్పాడు. ఒక్క‌రిని ఏడిపిస్తే ప‌ది మంది వెళ్లి త‌న్నాలని అన్నారు. అమ్మాయిలు ధైర్యంగా ఉంటేనే దేశం బాగుప‌డుతుంద‌ని చెప్పాడు. అమ్మాయిల్లో ఎంతో ధైర్యం ఉంటుంద‌ని చెప్పారు. అమ్మాయిలు ప్ర‌త్యేక హోదా మీద పోరాడాల‌ని అబ్బాయిల‌కు ధైర్యం చెప్పాలని ఆయ‌న సూచించాడు.

 

ఇక ఓ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే, అధికారంలోనే ఉండాల్సిన అవసరం లేదని అన్నారు. అధికారం లేకపోయినా సమస్యలను పరిష్కరించవచ్చని చెప్పుకొచ్చాడు. ఓ విద్యార్థి అనంతపురంలో ఓ గ్రామాన్ని ద‌త్త‌త తీసుకుంటారా? అని అడిగారు. దానికి స‌మాధానంగా ప‌వ‌న్ క‌ల్యాణ్.. ‘ఒక్క గ్రామాన్ని కాదు, మొత్తం అనంత‌పురాన్నే ద‌త్త‌త తీసుకుంటాన‌ని అన్నారు. అంతటితో ఆగకుండా మొత్తం రాయ‌ల‌సీమను ద‌త్త‌త తీసుకుంటానని చెప్పారు.

‘అమరావతి అభివృద్ధికి ఎంతో డ‌బ్బు ఖ‌ర్చుపెడుతున్నారు. అనంత‌పురాన్ని ప‌ట్టించుకోక‌పోతే నేను ఊరుకోను. అమ‌రావ‌తి అద్భుతంగా అభివృద్ధి జ‌రిగి, అనంత‌పురం ప్ర‌జ‌లు ఏడుస్తూ ఉంటే చూస్తూ ఊరుకోబోన‌ని అన్నారు. తాను ఏది మాట్లాడినా ఆలోచించే మాట్లాడ‌తాన‌ని అన్నారు’ అని ప‌వ‌న్ కల్యాణ్ అన్నారు. తాను దేశానికి, రాష్ట్రానికి ఏం చేయగలననే విషయాన్నే ఆలోచిస్తానని చెప్పి తన ప్రసంగం ముగించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Janasena  Pawan Kalyan  GATES interaction speech  

Other Articles