నోట్లు మార్చేపుడు టాక్స్ కట్ అవుతుందా? | Deposits Above Rs. 2.5 Lakh To Face Tax

Deposits above rs 2 5 lakh to face tax

New Currency inn India, Tax for Deposit, Banking Tax cutoff, Tax cutoff in India, New 500 and 1000 Notes, Notes exchange banking, New Tax Policy, No Tax currency exchange

No Tax for deposits below Rs. 2.5 Lakh, Penalty On Mismatch.

పాత నోట్లు మారిస్తే టాక్స్ కట్టాల్సిందేనా?

Posted: 11/10/2016 07:46 AM IST
Deposits above rs 2 5 lakh to face tax

కొత్త కరెన్సీ వ్యవహారంలో ఇప్పుడు ప్రజల్లో కొత్త కొత్త భయాలు నెలకొన్నాయి. ఓవైపు దొంగనోట్లతో మోసం జరిగే అవకాశం, నోట్లు మార్పిడి గురించి సతమతమవుతుంటే... మరోవైపు సక్రమంగా డిపాజిట్ చేసినా టాక్స్ చెల్లించాలంటూ ప్రకటనలు రావటంతో ఆంధోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో పాత రూ.500, రూ.1000 నోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ చేసే విషయమై ఐటీ శాఖ ఓ ప్రకటన చేసింది.

రైతులు, గృహిణులు రూ.2.5 లక్షల వరకు పెద్ద నోట్లను డిపాజిట్ చేసినా ఎలాంటి ఆందోళన చెందనవసరం లేదని ఆదాయపు పన్ను శాఖ అధికారులు అభయమిస్తున్నారు. అలాగే ఏడాది ఆదాయం పన్ను మినహాయింపులో ఉన్న వారు కూడా భయపడాల్సిందేం లేదని చెబుతున్నారు. అయితే రూ.2.5 లక్షల కన్నా ఎక్కువ మొత్తంలో చేసే డిపాజిట్లపై పన్ను ఉంటుందని కేంద్రం హెచ్చరించింది. అలాగే రిటర్నుల్లో సమర్పించిన ఆదాయ వివరాలతో సరిపోలకపోతే 200 శాతం జరిమానా ఉంటుందని స్పష్టంచేసింది.

‘ఈ ఏడాది నవంబర్ 10 నుంచి డిసెంబర్ 30 వరకు రూ.2.5 లక్షల కన్నా ఎక్కువ మొత్తంలో చేసే అన్ని ఖాతాల డిపాజిట్ల వివరాలు తెప్పించుకుంటాం. వీటిని డిపాజిటర్లు సమర్పించిన ఆదాయ రిటర్నులతో పోల్చిచూస్తాం. తేడాలుంటే దానికి తగినట్లు చర్యలు తప్పవు’ అని రెవెన్యూ కార్యదర్శి హస్ముక్ అధియా బుధవారం రాత్రి చెప్పారు. ఖాతాదారుడు సమర్పించిన వివరాలు సరిపోలకపోతే దాన్ని పన్ను ఎగవేతగా పరిగణిస్తారన్నారు. అప్పుడు ఆదాయపు పన్ను చట్టం 270 (ఎ) కింద 200 శాతం పెనాల్టీ విధిస్తామని ఆయన చెప్పారు.

ఆభరణాలు కొనే వారు పాన్ నంబర్‌ను విధిగా సమర్పించాల్సి ఉంటుందన్నారు. కొనుగోలుదారుల నుంచి పాన్ నంబర్లు తీసుకోని నగల దుకాణదారులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. పన్ను మినహాయింపు (రూ.2.5 లక్షల బ్రాకెట్) పరిమితిలో ఉన్నవారు నగదు డిపాజిట్ చేసినా భయపడాల్సిన అవసరం లేదని, అనుమానాస్పద కేసులైతే తప్ప అలాంటి వారి జోలికెళ్లమని ఐటీ శాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.

ఇక గృహిణులు రూ.2.5 లక్షల వరకు డిపాజిట్ చేసినా ఎలాంటి పన్ను ఉండదు. అయితే రూ.20 లక్షలు డిపాజిట్ చేస్తేనే సమస్య ఉంటుందన్నారు. 2-3 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్ చేసే వారి వివరాలనే పన్ను శాఖ పరిశీలిస్తుందన్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల ఆర్థిక పురోగతి ఉంటుందని, పన్నుల సేకరణ పెరుగుతుందని చెప్పారు. నగదు లావాదేవీల కంటే బ్యాంకు ఖాతా, చెక్, ఎలక్ట్రానిక్ చెల్లింపులను అనుసరిస్తే మేలన్నారు. మొత్తం కరెన్సీ మార్పిడికి 3-4 వారాల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు కరెన్సీ క్రైసిస్ ఫలితంగా పలు కంపెనీల లావాదేవీలు స్థంభించటంతోపాటు, చాలా వరకు విదేశీ యానాలు కూడా ఆగిపోయాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : New Currency  Bank Deposits  below 2.5 Lakhs  No Tax  

Other Articles